Recruitment in Northern Railway : నార్తర్న్ రైల్వేలో పలు ఉద్యోగ ఖాళీలు.. పూర్తి వివరాలు
వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, ఇంజనీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ, మూడేళ్ల డిప్లొమా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Recruitment in Northern Railway
Recruitment in Northern Railway : భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన నార్తర్న్ రైల్వేలో పలు ఉద్యోగ ఖాళీల బర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 323 అసిస్టెంట్ లోకో పైలట్, ట్రెయిన్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే జీవనశైలి మార్పులు !
వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, ఇంజనీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ, మూడేళ్ల డిప్లొమా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
READ ALSO : Gold Idli : 24 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ .. ధర ఎంతో తెలుసా..?
ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆగస్టు 28, 2023ను చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; nr.indianrailways.gov.in/ పరిశీలించగలరు.