Job Mela: మెగా జాబ్ మేళా.. అమర్ రాజా, యాక్సిస్, అపోలో సంస్థల్లో 500 పైగా జాబ్స్.. అస్సలు మిస్ అవకండి

Job Mela: ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా పీలేరులోని ఎస్‌జీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మరో జాబ్ మేళా జరుగనుంది.

Job Mela: మెగా జాబ్ మేళా.. అమర్ రాజా, యాక్సిస్, అపోలో సంస్థల్లో 500 పైగా జాబ్స్.. అస్సలు మిస్ అవకండి

Mega Job Mela in Annamayya district of Andhra Pradesh

Updated On : August 7, 2025 / 12:34 PM IST

చదువుకున్న యువత చాలా మంది ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు సైతం ముందుకు వస్తున్నాయి. జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా పీలేరులోని ఎస్‌జీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మరో జాబ్ మేళా జరుగనుంది. ఆగ‌స్టు 12వ తేదీన జరుగనున్న ఈ మెగా జాబ్‌మేళాలో పలు ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి, వివిధ విభాగాలలో యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను కల్పించనున్నాయి. కాబట్టి, అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ జాబ్ మేళాకు సంబందించిన మరిన్ని వివరాలు, సందేహాల కోసం 9966086996 నంబరును సంప్రదించవచ్చు.

సంస్థలు, ఖాళీల వివరాలు:

  • యంగ్ ఇండియాలో 30 పోస్టులు
  • AIL డిక్సన్ లో 50 పోస్టులు
  • నియోలింక్ 30 పోస్టులు
  • అపోలో ఫార్మసీలో 30 పోస్టులు
  • అమర రాజా బ్యాటరీలు లో 50 పోస్టులు
  • ఫాక్స్కాన్ రైజింగ్ స్టార్స్ లో 50 పోస్టులు
  • SMSE స్టాఫింగ్ సొల్యూషన్స్ 100 పోస్టులు
  • లూకాస్-TVఎస్ 20 పోస్టులు 20 పోస్టులు
  • యంగ్ మైండ్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ లో 60 పోస్టులు
  • సన్‌బిజ్ సొల్యూషన్స్ లో 30 పోస్టులు
  • ఆక్సిస్ బ్యాంక్ లో 50 పోస్టులు
  • ఐసీఐసీఐ బ్యాంక్ లో 50 పోస్టులు ఉన్నాయి.

ఇవన్నీ దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు కాబట్టి ఇది యువతకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మంచి జీతం, పని అనుభవం కూడా ఈ సంస్థల నుండి పొందవచ్చు. కాబట్టి అన్నమయ్య జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను అస్సలు మిస్ చేసుకోవద్దు.