AP Civil Surgeon Recruitment 2023 : వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(ఎపివివిపి)లో రెగ్యులర్ /కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భ‌‌‌‌ర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు హాజరుకావచ్చు.

AP Civil Surgeon Recruitment 2023 : వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్  పోస్టుల భర్తీ

AP Civil Surgeon Recruitment 2023

AP Civil Surgeon Recruitment 2023 : ఏపి వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి వాకిన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(ఎపివివిపి)లో రెగ్యులర్ /కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భ‌‌‌‌ర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు హాజరుకావచ్చు.

READ ALSO : Chandrababu Liquor Case : రాజకీయ కక్షతోనే వరుస కేసులు- మద్యం కేసులో చంద్రబాబు తరపు లాయర్ వాదనలు

ఖాళీల వివరాలు ;

గైనకాలజీ ; 12 ఖాళీలు
అనస్థీషియా ; 15 ఖాళీలు
పీడియాట్రిక్స్ ; 11
జనరల్ మెడిసిన్ ; 37
సాధారణ శస్త్రచికిత్స ; 03
ఆర్థోపెడిక్స్ ; 01
నేత్ర వైద్యం ; 10
రేడియాలజీ ; 38
పాథాలజీ ; 02
ENT ; 07
డెర్మటాలజీ ; 11
మనోరోగచికిత్స ; 01
ఫోరెన్సిక్ మెడిసిన్ ; 02
మొత్తం 150

READ ALSO : Pomegranate Cultivation : దానిమ్మ సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు !

విభాగాల వారీగా వాకిన్ రిక్రూట్ మెంట్ వివరాలు ;

డిసెంబర్ 11న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ,డెర్మటాలజీ , ఫొరెన్సిక్ సైన్స్ పోస్టులకు వాకిన్ రిక్రూట్మెంట్ ఉంటుంది.

డిసెంబర్ 13న గైనకాలజీ ,అనస్థీషియా,ఇఎన్టి, పెథాలజీ పోస్టులకు వాకిన్ రిక్రూట్మెంట్ జరుగుతుంది.

డిసెంబర్ 15న పీడియాట్రిక్స్ , ఆర్థోపిడిక్స్ , ఆప్తాల్మాలజీ , రేడియాలజీ , సైకియాట్రీ పోస్టులకు వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారు.

READ ALSO : Anand Mahindra : 97 ఏళ్ల బామ్మ సాహసం చూసారా? నా హీరో.. అంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

సమయం ;

ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాకిన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది.

READ ALSO : Rajasthan : పేదలకు అందుబాటులో IVF.. మ్యానిఫెస్టోలో పెట్టిన ఆ పార్టీ

వేదిక ;

వాకిన్ రిక్రూట్మెంట్ వేదిక గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, 77-2/జి, లక్ష్మీ ఎలైట్ బిల్డింగ్, పాతూరు రోడ్ చిరునామాలో ఉంటుందని ఎపిఎంఎస్ఆర్బీ మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

పూర్తి సమాచారం కోసం http://hmfw.ap.gov.in వెబ్సైట్ పరిశీలించగలరు.