DOST 2025: దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఇవాళే.. మీ అలాట్మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

DOST 2025: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో సీట్ల కేటాయింపు పూర్తవగా ప్రస్తుతం స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతోంది.

DOST 2025: దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఇవాళే.. మీ అలాట్మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana DOST final phase seat allotment today

Updated On : August 6, 2025 / 11:56 AM IST

తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో సీట్ల కేటాయింపు పూర్తవగా ప్రస్తుతం స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ ప్రక్రియ కూడా పూర్తవడంతో ఇవాళ అంటే ఆగస్ట్ 6న అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు అధికారులు.

ఇక దోస్త్ స్పెషల్ ఫేజ్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆన్ లైన్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అలాగే ఆగస్టు 6వ తేదీ నుంచే సీటు కేటాయించిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. దీని గడువు ఆగస్టు 8తో పూర్తవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే సీటు క్యాన్సల్ అవుతుంది.

మీ అలాట్మెంట్ ఇలా తెలుసుకోండి:

  • విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/welcome.do లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో క్యాండెట్ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
  • తరువాత మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో డిస్ ప్లే అవుతుంది.

    ప్రింట్/డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.

స్పాట్ అడ్మిషన్ల వివరాలు:

ఆగస్టు 11వ తేదీ న్నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో దోస్త్ స్పాట్ అడ్మిషన్లు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.