RCB JOBS : రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ లో బీకాం, బీబీఏ, గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్ , తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

RCB JOBS : రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో ఉద్యోగాల భర్తీ

Rcb

Updated On : July 12, 2022 / 8:20 PM IST

RCB JOBS : ఫరీదా బాద్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్ధ రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో గ్రాంట్స్ అడ్వైజర్, సిస్టమ్ అనలిస్ట్, సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ గ్రాండ్స్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ , టెక్నికల్ అసిస్టెంట్లు తదితర పోస్టులు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ లో బీకాం, బీబీఏ, గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్ , తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 45 ఏళ్లు లోపు ఉండాలి. నెలకు వేతనంగా 33,000 రూ నుండి 88,000వేలజీతం చెల్లిస్తారు.

అభ్యర్ధులను ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు జులై 21, 2022 ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.rcb.res.in/పరిశీలించగలరు.