Diabetes : డయాబెటిస్ తో బాధపడుతున్నారా? రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలో తెలుసా?

కొద్ది మొత్తంలో భోజనం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌లో స్ధాయిలను నియంత్రించటానికి సహాయపడుతుంది, అంతేకాకుండా ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.

Diabetes : డయాబెటిస్ తో బాధపడుతున్నారా? రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలో తెలుసా?

Suffering from diabetes

Updated On : August 29, 2022 / 9:23 AM IST

Diabetes : డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం అత్యంత సవాలుతో కూడుకున్న పని. చక్కెర స్థాయి గణనీయంగా తగ్గడం వల్ల తరచుగా మూర్ఛలు , నాడీ వ్యవస్థ దెబ్బతినడానికి దారితీస్తుంది. అటువంటి సంక్లిష్టతలను నివారించడానికి, రోజంతా తీసుకునే ఆహారం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన అన్ని పోషకాలతో కూడిన ఆహారంతోపాటుగా, శక్తిని పొందడానికి రోజుకు మూడు సార్లు భోజనం చేయాలని చిన్నప్పటి నుండి మనకు మనపెద్దలు అలవాటుగా మార్చారు. అయితే మధుమేహం ఉన్న వ్యక్తి విషయానికి వస్తే, రోజుకు మూడు సార్లు భోజనం ఏమాత్రం సరిపోదు.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజంతా తక్కువ వ్యవధిలో కొద్దికొద్ది మొత్తాల్లో కార్బోహైడ్రేట్‌లను తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ మెరుగవుతుంది. ఒకే సారి పెద్ద మొత్తంలో భోజనం చేయడం వల్ల వారు మందులు వాడినప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు తమ కార్బోహైడ్రేట్‌లు ,గ్లూకోజ్‌లను ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవడం కాకుండా రోజంతా సమానంగా తీసుకోవాలి.

ఒక అధ్యయనం ప్రకారం, మధుమేహంతో బాధపడేవారికి తరచుగా పెద్దమొత్తంలో కాకుండా కొద్దికొద్ది మోతాదులో భోజనం చేయడం చాలా మంచిదని అధ్యయనకారులు నిర్ధారణకు వచ్చారు. మధుమేహం, ప్రీడయాబెటిక్ ఉన్న 47 మంది పెద్దలపై ఈ అధ్యయనం నిర్వహించారు. కొద్ది మొత్తంలో తరచుగా భోజనం చేసేవారు తమ రక్తంలో చక్కెర స్థాయిని మరింత సులభంగా నిర్వహించగలుగుతున్నారని కనుగొన్నారు.

కొద్ది మొత్తంలో భోజనం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌లో స్ధాయిలను నియంత్రించటానికి సహాయపడుతుంది, అంతేకాకుండా ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. అనారోగ్యకరమైన ఆహారాలను తినకుండా నిరోధిస్తుంది. ఎవరైనా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, కొద్దికొద్ది మొత్తాల్లో భోజనం తినడం మంచిది కాదు. దీనివల్ల సులభంగా ఎక్కువ కేలరీలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారాలను తీసుకోవాలి. మధుమేహంతో బాధపడేవారితో సహా ఆరోగ్యవంతమైన ఆహార ఎంపికలు అందరికీ మేలు చేస్తాయి. ప్రత్యేకించి రోజువారి భోజనాన్ని, అల్పాహారాన్ని తీసుకోకుండా మానుకోవటం సరైందికాదు. ఎందుకంటే రోజులోని తొలి భోజనం జీవక్రియను ప్రారంభించడానికి సహాయపడుతుంది. అలాగే అతిగా తినకుండా నిరోధిస్తుంది.