మే 28న తెలంగాణ కేబినెట్ భేటీ

  • Published By: chvmurthy ,Published On : May 7, 2019 / 07:03 AM IST
మే 28న తెలంగాణ కేబినెట్ భేటీ

Updated On : May 7, 2019 / 7:03 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మే నెల 28 వ తేదీ జరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన అంశాలపై  ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.  కాగా..ఈనెల 23న వెలువడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.