దిశ హత్యాచారం : బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఒక మతాన్ని అవమానించేలా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయని అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని బహదుర్ పురా పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో దిశపై అత్యాచారం, హత్య సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ, తమ మతాన్ని కించపరిచారంటూ మహమ్మద్ నవాజుద్దీన్ అనే వ్యక్తి బహదుర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు.
(నవంబర్ 28, 2019) శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ పై నలుగురు యువకులు అత్యాచారం చేసి, హత్య చేశారు. అనంతరం షాద్‌నగర్ దగ్గర ఆమెను దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ నిందితుల్లో ఒకరైన మహ్మద్ ఆరిఫ్ కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.