ఆర్టీసీ కార్మికులకు ఊరట : జీతాలు చెల్లించాలని హైకోర్టులో ఆదేశం
ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు సోమవారం వరకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 49 వేల 190 మంది కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించ

ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు సోమవారం వరకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 49 వేల 190 మంది కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించ
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. సోమవారం(అక్టోబర్ 21,2019) లోపు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 49 వేల 190 మంది కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించ లేదు. అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్.. వెంటనే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
ప్రస్తుతం సమ్మె కొనసాగుతున్నందున సిబ్బంది లేరని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. ఇరు వాదనలు విన్న కోర్టు సోమవారం లోపు సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది.
ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తున్నారు. జీతాల పెంపు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తదితర డిమాండ్లతో స్ట్రైక్ కి దిగారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు విధుల్లోకి రాని వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ప్రకటించారు. ఆర్టీసీలో 1200 మాత్రమే ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. విధుల్లోకి రాని కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు కూడా ఇవ్వలేదు. దీంతో కార్మికులు కోర్టుని ఆశ్రయించారు. కోర్టులో వారికి ఊరట లభించింది.