కరోనా టెస్ట్‌లకోసం పూణే వెళ్లక్కర్లేదు.. హైదరాబాద్ సీసీఎంబీలో కరోనా పరీక్షలు మొదలు

హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక సీసీఎంబీ (Centre for Cellular and Molecular Biology) లో రేపటి నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఇందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ఐసీఎంఆర్ నుంచి అనుమతులు లభించాయి. హైదరాబాద్ సీసీఎంబీలో రోజుకు కనీసం 1000 నమూనాలను పరీక్షించే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు కరోనా టెస్టులు చేయాలంటే వైద్యపరీక్షలు చేసి పాజిటివ్‌గా తేలితే.. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం శాంపిల్స్ పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించేవారు. ఆ రిపోర్ట్స్ రావడానికి సమయం పట్టేది. రిపోర్ట్స్ వస్తే కానీ వారికి వైరస్ ఉందో? లేదో తెలిసేది కాదు. కానీ రేపటి నుంచి (మార్చి 31, 2020) మనకి అందుబాటులోనే హైదరాబాద్ హబ్సిగూడలోని CCMB (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయలాజీ) లో కరోనా టెస్టుల చేయనున్నారు.
కరోనా టెస్టుల కోసం అత్యాధునికమైన 12 రియల్ టైమ్ PCRలను సిద్ధం చేసినట్టు, 20 మంది నిపుణులను నియమించినట్టు CCMB డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా చెప్పారు. లైఫ్ సైన్సెస్ పరిశోధనల్లో అగ్రస్థానంలో ఉన్న CCMBని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు వేదికగా వాడుకోవడానికి అవకాశమివ్వాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఖ్యమంత్రి KCR విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.