4 గంటలు చర్చలు : కీలక అంశాలపై కేసీఆర్, జగన్ ఏకాభిప్రాయం
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ల భేటీ ముగిసింది. సుమారు 4 గంటల పాటు చర్చలు జరిగాయి. సోమవారం(సెప్టెంబర్ 23,2019) ప్రగతిభవన్ లో ఇరువురూ సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ల భేటీ ముగిసింది. సుమారు 4 గంటల పాటు చర్చలు జరిగాయి. సోమవారం(సెప్టెంబర్ 23,2019) ప్రగతిభవన్ లో ఇరువురూ సమావేశం
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ల భేటీ ముగిసింది. సుమారు 4 గంటల పాటు చర్చలు జరిగాయి. సోమవారం(సెప్టెంబర్ 23,2019) ప్రగతిభవన్ లో ఇరువురూ సమావేశం అయ్యారు. కీలక అంశాలపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. కృష్ణాకు గోదావరి జలాల మళ్లింపు, విభజన హామీలతో పాటు రాజకీయ అంశాలపై కేసీఆర్, జగన్ సుదీర్ఘంగా డిస్కస్ చేశారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ప్రత్యేకంగా చర్చించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై ఇరు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి జలాలను నాగార్జున సాగర్‌లోనూ… శ్రీశైలం జలాశయంలోనూ రోజుకు రెండు టీఎంసీల చొప్పున… 120 రోజులపాటు ఎత్తిపోయడంపై ఇద్దరు సీఎంలు ఇప్పటికే అంగీకరించారు. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ఇదే విషయాన్ని తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ కూడా తెలియజేశారు.
దుమ్ముగూడెం నుంచి అక్కంపల్లి దాకా 4 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి… అక్కడి నుంచి రెండు పాయలుగా విడదీసి… రెండు టీఎంసీలను నాగార్జునసాగర్‌లో, మరో రెండు టీఎంసీలను శ్రీశైలంలోకి పంపడంపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. పోలవరం అంశం కూడా సీఎంల మధ్య చర్చకు రానుంది. పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించడం.. ముంపు ప్రాంతాలను తగ్గించడం లాంటి ప్రతిపాదనలను తెలంగాణ తీసుకొస్తే.. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రతిపాదించనుంది. విభజన హామీలపై సీఎంలు చర్చించారు.