భారీగా మద్యం విక్రయాలు : మస్తు తాగారు

  • Published By: madhu ,Published On : October 7, 2019 / 03:45 AM IST
భారీగా మద్యం విక్రయాలు : మస్తు తాగారు

Updated On : October 7, 2019 / 3:45 AM IST

తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. కేవలం 48 నెలల్లో రూ. 40 వేల 800 కోట్ల అమ్మకాలు జరిగాయి. గత రెండేళ్లలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. నెలకు రూ. 850 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగింది. రోజుకు రూ. 28 కోట్ల పైమాటే జరిగినట్లు అంచనా. 2017-18లో రూ. 19 వేల కోట్ల అమ్మకాలు జరిగితే..2018-19లో రూ. 21 వేల కోట్ల విక్రయాలు జరిగాయి. మేడ్చల్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన వారు మస్తు తాగారు. 

మద్యం విక్రయాల ద్వారా గత రెండేళ్లలో రూ. 25 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించడం విశేషం. రోజువారీగా అమ్ముడవుతున్న బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్‌లతో పాటు బీర్ల లెక్కలను పరిశీలిస్తే..పాలతో సమానంగా ప్రజలు మద్యాన్ని సేవిస్తున్నట్టు అర్ధమౌతోంది. రోజుకు కోటి లీటర్ల వరక పాల వినియోగం ఉంటే..గత రెండేళ్లలో అమ్ముడైన మద్యం లెక్కలు రోజుకు 37 లక్షల లీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మద్యం విక్రయాల విలువ ఏటేటా భారీ ఎత్తున పెరుగుతోంది. ఒక్క ఏడాదిలోనే 15 శాతం విక్రయాలు పెరిగాయని లెక్కలు చూస్తే తెలుస్తుంది. 
Read More : బై..బై..నైరుతి : రెండు రోజుల్లో తెలంగాణాలో వర్షాలు