బీజేపీ, కాంగ్రెస్ కి సిగ్గుండాలి : తెలంగాణలోనే జీతాలు ఎక్కువ
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు ఆయన పలు సూచనలు చేశారు. యూనియన్ నేతల మాటలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు ఆయన పలు సూచనలు చేశారు. యూనియన్ నేతల మాటలు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు ఆయన పలు సూచనలు చేశారు. యూనియన్ నేతల మాటలు నమ్మొద్దని కార్మికులను కోరారు. కార్మికులు తమ తప్పు తెలుసుకుని వెంటనే ప్రభుత్వానికి సరెండర్ అవ్వాలని చెప్పారు. కార్మిక సంఘాల నేతలు రెచ్చగొట్టి కార్మికులను సమ్మెలోకి దించారని ఆయన ఆరోపించారు. పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూడటం సరికాదన్నారు.
ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీపైనా ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. కార్మిక సంఘాలకు, ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వడానికి బీజేపీ, కాంగ్రెస్ లకు సిగ్గు ఉండాలని ఎర్రబెల్లి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఖరే ఆర్టీసీ పరిస్థితికి కారణం అన్నారు.
మిగిలిన రాష్ట్రాల్లో కన్నా తెలంగాణలోనే ఆర్టీసీలో జీతాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ కార్మికులకు చెల్లించని స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం జీతాలు ఇస్తోందని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు వేరే రాష్ట్రాల్లో 33శాతం ఫిట్ మెంట్ ఇస్తుంటే.. తెలంగాణలో 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. తమ స్వార్థం కోసం ఆర్టీసీ సమ్మెను ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు.