ఆర్టీసీ సమ్మెపై రంగంలోకి ఎమ్మెల్యేలు

  • Published By: veegamteam ,Published On : October 25, 2019 / 01:09 PM IST
ఆర్టీసీ సమ్మెపై రంగంలోకి ఎమ్మెల్యేలు

Updated On : October 25, 2019 / 1:09 PM IST

టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. డిపోల పరిధిలోని కార్మికులతో మంతనాలు చేసే యోచనలో ఉన్నారు. బస్‌ డిపోలు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్‌ కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌పై అధికారుల కమిటీ రెండు రోజులు కసరత్తు చేసింది. రెండు రోజుల్లో స్పష్టత వచ్చే ఛాన్స్‌ ఉంది.

ఆర్టీసీ ఎమ్మెతో రవాణా వ్యవస్థలో తలెత్తిన ఇబ్బందులను తొలగించేందుకు నియోజక వర్గ కేంద్రంలో ఆయా జిల్లా, నియోజకర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ముందుకు వస్తున్నారు. కార్మికులతో మధ్యవర్తిత్వం వహించేందుకు చొరవ చూపుతున్నారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి వస్తే ప్రజల ఇబ్బందులు కూడా తొలగిపోతాయన్న అభిప్రాయంతో కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే అంతర్గతంగా చర్చించుకున్నట్లు సమాచారం. 

ఇప్పటికైతే ఆర్టీసీ సంఘాలు, కార్మికులతో ఎవరూ మాట్లాడకపోయినా త్వరలో పార్టీలో కొంతమంది బలమైన నేతలు వారితో మాట్లాడి, తమ వంత కృషి చేసే అవకాశం ఉంది. కార్మికులను విధుల్లో చేరేలా ఒప్పించేందుకు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపిస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్యేలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. 

కార్మిక సంఘాలతో ఇప్పటివరకు చర్చలు జరిగాయి కానీ… ఇలాంటి వ్యవహారం జరుగలేదు. త్వరలో ఆర్టీసీ కార్మికులను సంప్రదించి వారిని విధుల్లో చేరే విధంగా ప్రయత్నం చేస్తామని కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి సంప్రదింపులు స్థానికంగానే జరిగే అవకాశం కనిపిస్తోంది.