తెలంగాణ, ఏపీ సీఎం సహాయనిధికి మైహోం ఇండ్రస్ట్రీస్ చెరో రూ.3 కోట్ల విరాళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సహయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మై హోం ఇండ్రస్ట్రీస్ రూ.3 కోట్ల విరాళం అందించింది.
ఇందుకు సంబంధించిన చెక్కును మై హోం ఇండ్రస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ జుపల్లి రంజిత్ రావు శుక్రవారం తాడేపల్లి, సీఎం క్యాంపు కార్యాలయంలో, సీఎం జగన్‌కు అందచేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు బాసటగా మై హోం ఇండ్రస్ట్రీస్ గ్రూప్ రూ.3 కోట్ల విరాళం అందచేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసిన మై హోం ఇండ్రస్ట్రీస్ గ్రూప్ డైరెక్టర్లు జూపల్లి రాము రావు, జూపల్లి శ్యాంరావు 3 కోట్ల రూపాయల చెక్కును సీఎం కు అందచేశారు.
కరోనా వ్యాప్తి నిరోధానికి తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల్లో ఇమ్యునిటీ పవర్ పెంచటానికి హోమియో మందులను పంపిణీ చేసింది మై హోమ్ గ్రూప్. 28 వేల బాటిళ్ల ఆర్సెనిక్ ఆల్బ్ మందులను పోలీసులకు అంద చేసింది. క్లిష్ట పరిస్ధితుల్లో పనిచేస్తున్న పోలీసుల సంక్షేమం కోసం మందులను పంపించిన మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్.జూపల్లి రామేశ్వర రావుకు ఐజీ సంజయ్ కుమార్ జైన్ కృతజ్ఞతలు తెలియచేశారు.