సిటిజన్‌ల డిమాండ్: ఫ్లై ఓవర్ తెరవండి.. ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Published By: vamsi ,Published On : April 5, 2019 / 03:41 AM IST
సిటిజన్‌ల డిమాండ్: ఫ్లై ఓవర్ తెరవండి.. ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి

Updated On : April 5, 2019 / 3:41 AM IST

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరవాసులు మంజీరా మెజిస్టిక్‌ షాపింగ్‌ మాల్‌ నుంచి మలేషియన్‌ టౌన్‌పిష్‌ వైపు వెళ్లే రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ను వెంటనే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వంతెనను వినియోగంలోకి తెస్తే ఈ మార్గం నుంచి ప్రయాణించే దాదాపు నాలుగైదు లక్షల మందికి ఊరట లభిస్తుందని, ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయిని వాళ్లు చెబుతున్నారు. ‘ఫ్లై ఓవర్‌ లేక ముందు.. నిర్మాణం ప్రారంభం కాకముందు.. ఎన్నో అవస్థలు భరించాం. ఫ్లై ఓవర్‌ పూర్తయింది. అనుమతించడానికి ఇబ్బంది ఎంటీ? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

Read Also : బ్లేడుతో పనిలేదు: రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్‌బై

అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఫ్లై ఓవర్‌ను ఓపెన్ చేయట్లేదని అధికారులు చెబుతున్నారు. కోడ్‌ అడ్డువస్తే అధికారికంగా లాంఛనాలతో ప్రారంభోత్సవం చేయకపోయినా మెట్రో ఓపెన్ చేసినట్లుగా ప్రయాణానికి అనుమతించాలని నగరవాసులు కోరుతున్నారు. అనుమతిస్తే నిత్యం నిజాంపేట్, ప్రగతినగర్, కూకట్‌పల్లి మీదుగా హైటెక్‌సిటీకి వెళ్లే వారికి, అటు నుంచి ఇటు వచ్చేవారికి ఎంతో మేలు జరుగుతుంది. రాజీవ్‌గాంధీ విగ్రహం, మలేషియా టౌన్‌షిప్‌ల మీదుగా హైటెక్‌సిటీకి వెళ్లేవారికి ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయి. మంజీరా మెజిస్టిక్‌ షాపింగ్‌మాల్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్‌ మలేషియా టౌన్‌షిప్‌ ముందు ముగుస్తుంది.

ఫ్లై ఓవర్ వివరాలు:
వ్యయం    :         రూ.97.94 కోట్లు
పొడవు    :           1230 మీ.
వయడక్డ్‌ పొడవు:      780 మీ.
ఆబ్లిగేటరీ స్పాన్‌ పొడవు:  90 మీ.
అప్రోచెస్‌ పొడవు:         360 మీ.
వెడల్పు    :    20 మీ.
క్యారేజ్‌వే    :       ఆరు లైన్‌లు(రెండువైపులా ప్రయాణం)
కాంట్రాక్ట్‌ ఏజెన్సీ:        ఎం.వెంకట్రావు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌

Read Also : పవర్‌లోకి వస్తే ఈసీని జైలులో పెడుతా: బీఆర్‌.అంబేద్కర్ మనవడు