రైల్వేశాఖ, టీఎస్‌ ఆర్టీసీ మధ్య పోటీ : సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులు 

సంక్రాంతికి రైల్వే, టీఎస్‌ ఆర్టీసీ పోటీపడుతున్నాయి. పండగకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసుల కోసం ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఒకరికొకరు పోటీ పడుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 05:07 AM IST
రైల్వేశాఖ, టీఎస్‌ ఆర్టీసీ మధ్య పోటీ : సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులు 

Updated On : January 8, 2020 / 5:07 AM IST

సంక్రాంతికి రైల్వే, టీఎస్‌ ఆర్టీసీ పోటీపడుతున్నాయి. పండగకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసుల కోసం ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఒకరికొకరు పోటీ పడుతున్నారు.

సంక్రాంతికి రైల్వే, టీఎస్‌ ఆర్టీసీ పోటీపడుతున్నాయి. పండగకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసుల కోసం ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. 408 ప్రత్యేక రైళ్లను నడిపాలని అధికారులు చూస్తుంటే.. 4వేల 940 బస్సులను నడపాలని టీఎస్‌ ఆర్టీసీ టార్గెట్ పెట్టుకుంది. అయితే, చార్జీల విషయంలో మాత్రం కండిషన్స్ అప్లై అంటున్నాయి. 

సంక్రాంతిని క్యాష్‌ చేసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే, టీఎస్ ఆర్టీసీ పోటీ పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా 408 రైళ్లను నడపబోతుంది. టీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతి పండగతో ఖజానా నింపుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. గతంతో పోల్చుకుంటే ఈ సంక్రాంతికి 200పైగా అదనపు సర్వీసులను నడపబోతున్నారు. ఈ నెల 10 నుంచి పండగ ముగిసిన మూడు రోజుల వరకు సాధారణ సర్వీసులతో పాటు, స్పెషల్ సర్వీసులను నడపడానికి ప్లాన్ చేస్తున్నారు.

దక్షిణ మధ్య రైల్వే కూడా అస్సలు తగ్గడం లేదు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది డబుల్ సర్వీసులను నడుపుతోంది. 58 జన సాధారణ్‌ రైళ్లు, 26 సువిధా స్పెషల్, 324 స్పెషల్ ట్రైన్లు నడుపుతోంది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ విజయనగరం, మచిలీపట్నం, నాందేడ్, రాయచూర్, నాగర్ సోల్ వరకు స్పెషల్‌ ట్రైన్లు వేసింది. సంక్రాంతి కోం 408 రైళ్లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. దాదాపుగా అన్నింట్లోనూ రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి.

సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగకు 4వేల 940 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంటర్ స్టేట్ సర్వీసులకు మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 

సంక్రాంతి నేపధ్యంలో ప్రైవేటు బస్సుల దందాపై ఫోకస్ పెట్టారు మంత్రి పేర్ని నాని. అధిక చార్జీలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపటటిన రవాణా శాఖ.. ఒక్కరోజులోనే 73 బస్సులు సీజ్ చేశారు. మరో 45 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్, మార్నింగ్ స్టార్, కావేరి, భవాని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదయ్యాయి. రెడ్ బస్, అభి బస్ యాజమాన్యాలకు మోటార్ వెహికల్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు అధికారులు.