తెలంగాణలో మరో రెండ్రోజుల్లో వర్షాలు

రానున్న రెండ్రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

  • Published By: veegamteam ,Published On : October 26, 2019 / 10:50 AM IST
తెలంగాణలో మరో రెండ్రోజుల్లో వర్షాలు

Updated On : October 26, 2019 / 10:50 AM IST

రానున్న రెండ్రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

రానున్న రెండ్రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర.. దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనంగా మారింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతోంది. 

దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయి.