సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదిక
సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదిక సిద్ధమైంది. కార్మికుల 21 డిమాండ్లపై ఈడీ కమిటీ రెండు నివేదికలు రెడీ చేసింది.

సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదిక సిద్ధమైంది. కార్మికుల 21 డిమాండ్లపై ఈడీ కమిటీ రెండు నివేదికలు రెడీ చేసింది.
టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఆర్టీసీ విలీనం మినహా కార్మికుల 21 డిమాండ్లపై ఈడీ కమిటీ రెండు నివేదికలు రెడీ చేసింది. హైకోర్టుకు సమగ్ర వివరాలు అందించేలా రిపోర్టులు తయారు చేశారు. ప్రతి అంశానికి రెండు రకాల సమాధానాలను సిద్ధం చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ రెండు రకాల నివేదికను తయారు చేసింది. కాసేపట్లో ఈడీల కమిటీ సీఎం కేసీఆర్ కు నివేదికను అందించనుంది.
అద్దె బస్సుల అవసరంపై ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారు. డిమాండ్ల అమలుతో ఆర్టీసీపై పడే భారం వివరాలతో నివేదికలను సిద్ధం చేశారు. ప్రభుత్వం హైకోర్టులో ఈ నివేదికను దాఖలు చేయబోతున్న క్రమలో నివేదికలో ఏముందన్న దానికి సంబంధించి ఆసక్తి రేకెత్తిస్తోంది. కార్మికుల 21 డిమాండ్లపై కమిటీ రెండు రకాల నివేదికలు సిద్ధం చేసింది.
నిన్న డ్రాఫ్ట్ కాపీని సీఎంవో ఆఫీసుకు పంపించినట్లు బస్ భవన్ నుంచి సమాచారం. కార్మికుల 21 డిమాండ్లలో ఆర్టీసీ పరిష్కరించాల్సిన డిమాండ్లు ఏమేరకు ఉన్నాయి.. అలాగే ప్రభుత్వం సహాయం ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి రెండు సమాధానాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్మికుల సంక్షేమం, పీఎఫ్ సొమ్ము, ప్రభుత్వ పథకాలు, ఈఎస్ ఐ ఆస్పత్రిలో చికిత్స, మందుల సరఫరాతో పాటు అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం కార్మికులకు చేదోడూ వాడుగా ఉంటే తప్పా పరిష్కారం కావనే అంశాలను నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది.
కార్మికుల 21 డిమాండ్లలో 19 డిమాండ్లు ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించే అవకాశం ఉన్నా పూర్తి స్థాయిలో నిధులు లేకపోవడం వల్ల భవిష్యత్ లో ఎదురయ్యే పరిణామాలను కింద నోట్ గా ఉంచినట్లు సమాచారం. మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సుల కోసం మరోసారి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. సమ్మె కారణంగా ఇంతకముందే ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.