శబరిమల స్పెషల్ : 81 ప్రత్యేక రైళ్లు

  • Published By: chvmurthy ,Published On : November 3, 2019 / 02:39 AM IST
శబరిమల స్పెషల్ : 81 ప్రత్యేక రైళ్లు

Updated On : November 3, 2019 / 2:39 AM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 81 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రతి ఏటా నవంబరు నుంచి జనవరిలో వచ్చే మకరసంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.

వీరికోసం హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, అకోలా, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్ లనుంచి కేరళలోని కొల్లం మధ్య ఈ రైళ్లు నడపనున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 18 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.