Weather Update : కోస్తాకు భారీ వర్ష సూచన

  • Published By: madhu ,Published On : August 24, 2019 / 01:56 AM IST
Weather Update : కోస్తాకు భారీ వర్ష సూచన

Updated On : May 28, 2020 / 3:43 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 24, ఆగస్టు 25 తేదీల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్‌, దక్షిణ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో 1.5 కిలో మీటర్ల  నుంచి 4.5 కిలో మీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో కొద్ది రోజులుగా తిరుమలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఉత్తర కోస్తాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 

ఆగస్టు 23వ తేదీన శుక్రవారం సాయంత్రానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 ఉపరితల ఆవర్తనం ఉందని అధికారులు వెల్లడించారు. ఇదే అల్పపీడనంగా బలపడుతుందని..శనివారం కోస్తా జిల్లాల్లో, ఒకటి..రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

మరోవైపు మంచిర్యాల జిల్లావ్యాప్తంగా వర్షాలు పడడంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణపూర్ ఓసీల్లో భారీగా వరదనీరు చేరింది. గనుల్లోని రోడ్లన్నీ బురుదమయం కావడంతో భారీ వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు కోట్ల రూపాయలలో నష్టం వాటిల్లింది. 
Read More : http://10tv.in/software-engineer-tn-held-exploiting-women-12530http://10tv.in/software-engineer-tn-held-exploiting-women-12530