Bus Accident: రెండు ఘోర బస్సు ప్రమాదాలు.. 52మంది మృతి
అఫ్టనిస్థాన్ లో రెండు ఘోర బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కాబూల్ - కాందహార్ హైవేపై జరిగిన రెండు పెద్ద రోడ్డు ప్రమాదాల్లో 52 మంది మరణించగా.. 65 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Bus Accident
Bus Accident: అఫ్గానిస్థాన్ లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కాబూల్ – కాందహార్ హైవేపై జరిగిన రెండు పెద్ద రోడ్డు ప్రమాదాల్లో 52 మంది మరణించగా.. 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఘజ్నీ ప్రావిన్స్ లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజ్నీ ప్రావిన్స్ లోని షాబాజ్ గ్రామ సమీపంలో మొదటి ప్రమాదం జరిగింది. ఇంధనం నింపిన ట్యాంకర్ ను ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, ట్యాంకర్ రెండు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో 20మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పలువురు మృతిచెందారు.
Also Read: Youtuber Bhanu Chander Arrest : తిక్క కుదిరింది.. రోడ్డుపై డబ్బులు విసిరేసిన ఆ యూట్యూబర్ అరెస్ట్..
మరోవైపు అందర్ జిల్లాలో మరో బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకిదిగి పలువురిని రక్షించాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
🇦🇫 52 KILLED, 65 INJURED IN DEADLY AFGHANISTAN BUS ACCIDENTS
Two tragic bus accidents on the Kabul-Kandahar Highway in central Afghanistan claimed 52 lives and left 65 injured, officials confirmed Thursday.
One bus collided with a fuel tanker near Shahbaz village in Ghazni… pic.twitter.com/kjn6sns2nl
— Mario Nawfal (@MarioNawfal) December 19, 2024