PM Modi: బైడెన్ కంటే ముందు కమలాహారిస్ ను కలవనున్న పీఎం మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ ను కలవనున్నారు. సెప్టెంబర్ 24న జరగనున్న సమావేశానికి ముందస్తుగా...

PM Modi: బైడెన్ కంటే ముందు కమలాహారిస్ ను కలవనున్న పీఎం మోదీ

Pm Modi Kamlaharis

Updated On : September 19, 2021 / 12:17 PM IST

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ ను కలవనున్నారు. సెప్టెంబర్ 24న జరగనున్న సమావేశానికి ముందస్తుగా ఇలా భేటీ అవుతున్నారు. ముందుగా భారత సంతతికి చెందిన కమలాహారిస్ ను కలిసిన ప్రధాని మోదీ.. తర్వాత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను కలుస్తారు.

ద్వైపాక్షిక సమావేశం అనంతరం జపాన్ పీఎం యోషిహిడే సుగా, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌తోనూ చర్చల్లో పాల్గొనున్నారు. అఫ్ఘానిస్తాన్ సంక్షోభం, ఇండో-పసిఫిక్, కొవిడ్-19 మహమ్మారి అంశాల గురించి చర్చిస్తారు.

న్యూఢిల్లీకి చెందిన వాషింగ్టన్ అధికారులు ఇలా అంటున్నారు. ముందుగా వ్యక్తిగతంగా చర్చించి అనంతరం.. జపాన్, ఆస్ట్రేలియాల ప్రధానులతో భేటీ అవుతారు. అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలు కలిసి ఇండో-పసిఫిక్ ప్రాంతాల పాలన, వనరుల అందుబాటు గురించి చర్చలు నిర్వహిస్తారు.

Tollywood : క్యాన్సర్‌‌తో పోరాడుతున్న అభిమానితో మాట్లాడిన ప్రభాస్