ఢాకా : ఎయిర్ పోర్ట్ వద్ద 250 కిలోల బాంబు కలకలం

Bangladesh : Dhaka airport 250 kg live bomb : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఎయిర్ పోర్టు వద్ద 250 కిలోల బాంబు తీవ్ర కలకలం రేపింది. ఎయిర్ పోర్టు వద్ద విస్తరణ పనులు జరుగుతుండగా బుధవారం (డిసెంబర్ 9,2020)బయటపడిన బాంబు కలకలం రేపింది.
హజ్రత్ షాజ్‌లాల్ (హిసా) అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినళ్ల విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా సిలిండర్ ఆకారంలో ఉన్న 250 కిలోల బరువున్న బాంబు బయటపడింది.
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్ ఘటనాస్థలానికి చేరుకుంది. ఆ భారీ బాంబుని జాగ్రత్తగా నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం జరిగిన యుద్ధం సమయంలో ఈ బాంబును విడిచిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
బాంబును జాగ్రత్తగా నిర్వీర్యం చేయటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటించింది. ఇది ‘జనరల్ పర్పస్’ బాంబుగా గుర్తించబడింది. శత్రు దళాలు, వాహనాలు,భవనాలకు నష్టం కలిగించడానికి గాలి నుండి జారవిడిచిన బాంబు అని ఒక సైనిక బాంబు నిపుణుడు తెలిపారు.