Bharat-Bangladesh : భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో స్మగ్లింగులకు చెక్ పెట్టటానికి మహిళా పోలీసులు

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో స్మగ్లింగులకు చెక్ పెట్టటానికి మహిళా పోలీసులు నిరంతరం గస్తీ కాస్తున్నారు.

Bharat-Bangladesh : భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో స్మగ్లింగులకు చెక్ పెట్టటానికి మహిళా పోలీసులు

Bharat Bangladesh (1)

Updated On : January 3, 2022 / 3:45 PM IST

India-Bangladesh Border Women Patrolling : అన్నింటా మేము..అంతా మేము అంటున్నారు వీరనారీమణులు. పలు రంగాల్లో రాణించే మహిళలు సైన్యంలోనే ప్రతిభ చాటుతున్నారు. దేశ సరిహద్దుల్లో కాపలాకాస్తున్నారు. కరడు కట్టిన మావోయిస్టులతో పోరు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత సరిహద్దుల్లో జరిగే స్మగ్లింగులకు చెక్ పెడతామంటున్నారు. అర్ధరాత్రి అయినా సరే డ్యూటీలో అదిరేది లేదు..బెదిరేది లేదు..దేశంలోకి హద్దులు దాటి ఏ అక్రమ రవాణాలను చొరబడనిచ్చేది లేదంటున్నారు.

Read more : ఆకాశమంతా వారిదే..! : ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో సత్తా చాటుతున్న అతివలు

భారత్‌ – బంగ్లాదేశ్‌ సరిహద్దులో పెట్రోలింగును మరింత పటిష్ఠం చేసింది భారత సైన్యం. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్న మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుళ్లను నియమించింది సరిహద్దు భద్రతాదళం. పశ్చిమ బెంగాల్‌లోని హరిదాస్‌పుర్‌ – జయంతీపుర్‌ సరిహద్దుల్లో 36 మంది మహిళా కానిస్టేబుళ్లు పహారా కాస్తున్నారు. అర్థరాత్రి అయినా కళ్లల్లో ఒత్తులు వేసుకుని అనుక్షణం కావలికాస్తున్నారు.

Read more : Sneha Dubey : ఎవరీ స్నేహ దుబే..UN వేదికపై పాకిస్థాన్ తీరును చీల్చి చెండాడి..ప్రధాని ఇమ్రాన్ ను ఏకి పారేసిన ధీర..!!

కేవలం కొన్ని మీటర్ల దూరంలో బంగ్లాదేశ్‌ ఉండటం.. పలుచోట్ల కంచె కూడా లేకపోవటంతో పలు అసాంఘిక పనులకు వీలుకలిగినట్లుగా ఉంది. దీంతో కొంతమంది గ్రామస్థులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో స్మగ్లింగులు జరుగుతున్నాయి. అటుపంజాబ్‌లోనూ గురుదాస్‌పుర్‌ జిల్లాలో ఉండే 138 కి.మీ.ల సరిహద్దుల్లో కూడా మహిళా జవానులు పహారా కాస్తున్నారు. రావి నదీతీరంలో మహిళు నిరంతరం గస్తీ కాస్తూ.. శత్రువుల కదలికలను పర్యవేక్షిస్తుంటారు. అనుక్షణ అప్రమత్తంగా ఉంటారు.