న్యూ ఇయర్ మొదలైంది : న్యూజిలాండ్‌లో సంబరాలు

న్యూజిలాండ్ : కొత్త సంవత్సరం వచ్చేసింది..పాత సంవత్సరానికి బై..బై చెప్పేశారు..మంచి..చెడులతో కూడుకున్న సంవత్సరానికి వీడ్కోలు చెప్పేసి కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ ప్రజలు గ్రాండ్‌గా వెల్ కం చెప్పారు. 5, 4, 3, 2, 1, 0..కౌంట్ డౌన్ చెబుతూ…కేరింతలు కొడుతూ..రంగు రంగుల బాణాసంచాలు కాల్చారు. ఆకాశంలోదద్దరిల్లేలా..కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్న వెలుగులను ప్రజలు తెగ ఎంజాయ్ చేశారు. సంగీతం..డ్యాన్స్‌లు..చేస్తూ..కేరింతలు కొడుతూ ఘనంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
సందడి వాతావరణం…
న్యూజిలాండ్ ప్రదాన కూడళ్లలో సందడి వాతావరణం నెలకొంది. వేడుకలు వీచిక్షేందుకు భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆయా ప్రాంతాల్లో సందడి సందడి వాతావరణం నెలకొంది. కేకులు కోసి ఒకరినొకరు తినిపించుకుంటూ…శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. ప్రధానంగా ఆక్లాండ్ నగరంలో జరిగిన వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లోని ప్రధాన రెస్టారెంట్లు..పబ్‌లు..బార్‌లో సందడి మాత్రం చెప్పాల్సిన పని లేదు. కొత్త సంవత్సరాల వేడుకలకు ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సహాయ సిబ్బంది..అంబులెన్స్‌లు..ఇతర అధికారులను నియమించారు.