లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేసే వాళ్లని పట్టుకోవడానికి డ్రోన్లు

బయట తిరగొద్దురా చస్తారు.. సమాజం బాగుండాలంటే సోలోగా ఉండాలని చెప్తుంటే వినే వాళ్లు లేకుండా పోతున్నారు. వీరికి కాపాలా కాయడమే సరిపోతుంది పోలీసుల పని. అయితే టెక్నాలజీ వాడి కంట్రోల్ చేయాలనుకుంటున్నారు పోలీసులు. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో స్వల్ప విరామంతో ఆడియో మెసేజ్ లు ఇతర పద్ధతులు వాడి అదుపు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే పోలీసులు వెళ్లలేని ప్రదేశాల్లో డ్రోన్లతో కాల్పులు జరుపుతున్నారు. చైనాలోనూ ఇదే టెక్నిక్ వాడుతున్నారు. ఇంగ్లాండ్‌లోని డెర్బీషైర్ లో టూరిస్ట్ ప్లేస్ లలో వ్యక్తులు తిరుగుతున్న వీడియోను పోలీసులు పోస్టు చేశారు. 90 సెకన్ల వీడియోలో వాహనాలతో, కాలి నడకన విజిటింగ్ ఏరియాల్లో తిరుగుతుండటం గమనించారు.
ఈ ప్రదేశాల్లో ప్రజలు తిరుగుతున్నట్లు గమనించాం. కొందరు ఓ 20కిలో మీటర్ల దూరం నుంచి కార్లతో వస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యవసరమైతేనే ప్రయాణం చేయండి. ఇది క్షమించదగ్గ విషయం కాదు. ప్రజలు సురక్షితంగా ఉండమంటే చట్టాన్ని మీరి ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని ఎలా అయినా పట్టుకోగలం. బాధ్యతగా ప్రవర్తించండి అంటూ ట్వీట్ చేస్తున్నారు.
ఆ డ్రోన్లను థర్మల్ సెన్సార్, స్మార్ట్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నారు. దాంత పాటుగా ఇన్ఫెక్షన్ ఉన్నవారిని, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిని అవి ఇట్టే పసిగట్టగలవు. మహమ్మారి ప్రబలుతున్న సమయంలో డ్రోన్లు బాగా పనిచేస్తున్నాయని.. చైనా వాళ్లు తయారు చేసినవి ప్రజలను పట్టిస్తున్నాయని పొగిడేస్తున్నారు అమెరికన్లు.