బిగ్ బ్రేకింగ్ : అమెరికాలో 1000 మంది  సైనికులకు కరోనా

  • Published By: madhu ,Published On : April 7, 2020 / 07:34 AM IST
బిగ్ బ్రేకింగ్ : అమెరికాలో 1000 మంది  సైనికులకు కరోనా

Updated On : April 7, 2020 / 7:34 AM IST

అగ్రరాజ్యం అమెరికాను కరోనా కుమ్మేస్తోంది. వరుసగా కరోనా కేసులు బయటపడుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా సైన్యంపై కరోనా బాంబు పడింది. 1000 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. 303 మంది నేషనల్ గార్డ్స్, ఓ విమాన నౌకలో ఉన్న 150 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో పెద్ద సంఖ్యలో సైనికులను క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే పాజిటివ్ కేసులతో అమెరికా ఉక్కిరిబిక్కిరవుతోంది. 

అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ నుంచి కాపాడటానికి అమెరికా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు ఇవ్వడం లేదు. మూడు వారాలుగా అత్యవసర పరిస్థితి విధించారు. వైరస్ సోకకుండా ఉండేందుకు చర్యలు తీసుకొనేందుకు సైన్యం రంగంలోకి దిగింది. వీరి ద్వారా కొంతమంది సైనికులకు కరోనా వైరస్ సోకిందని భావిస్తున్నారు. 

అమెరికాలో కరోనా ప్రతాపం ఎక్కువగా న్యూయార్క్‌ నగరంలోనే ఉంది. మొత్తం పదివేల మంది మృతుల్లో… 4,758 మంది న్యూయార్క్‌లోనే చనిపోయారు. ఇక్కడ నలుగురు తెలుగువారు కూడా కరోనాకు బలయ్యారు.  న్యూయార్క్‌లో ఒక్కరోజులో 600మంది చనిపోవడం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. 

ఇక అమెరికాలో బాధితుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 3 లక్షల 66 వేలు దాటింది. నిన్న ఒక్కరోజే 29వేల 439 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక న్యూయార్క్‌లో బాధితుల సంఖ్య లక్షా 30వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,898  కేసులు నమోదయ్యాయి. 

చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా  ప్రస్తుతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వైరస్‌ బారిన పడగా…వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనుషులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. (పోలీసులకు రిక్వెస్ట్: లవర్‌ను కలవాలి.. పర్మిషన్ ఇవ్వండి)