ఆస్ట్రేలియాలో కార్చిచ్చు : బాధితులను ఆదుకోవడంపై ఫోకస్

ఆస్ట్రేలియా ప్రభుత్వం కార్చిచ్చు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. నాలుగు నెలల క్రితం మొదలైన మంటలు..ఇంకా ఆరడం లేదు. అక్కడి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా..పరిస్థితిలో మార్పు రావడం లేదు. 24 మంది ప్రాణాలు కోల్పోగా..లక్షలాది జంతువులు అగ్నికి ఆహాతుయ్యాయి. ఆదివారం కొంత వర్షం పడడంతో మంటలు కాస్త ఉపశమించాయి. కానీ..ఏ క్షణానైన్నా తిరిగి అంటుకొనే ఛాన్స్ ఉందని ప్రభుత్వం హెచ్చరించడంతో ఆస్ట్రేలియా వాసులు వణికిపోతున్నారు.
మరోవైపు సర్వం కోల్పోయిన కుటుంబాలను .. ధ్వంసమైన ప్రాంతాలను ఆదుకునేందుకు ఓ యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది ప్రభుత్వం. ప్రస్తుత విపత్తును నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించడమే కాకుండా.. పునరావాస కార్యక్రమాల కోసం రూ. 10 వేల కోట్ల రూపాయలను వచ్చే రెండేళ్లలో ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.
నేషనల్ రికవరీ ఫండ్ నుంచి ఈ సాయం విడతలవారీగా బాధితులకు అందించనున్నారు. దేశ ఆర్ధిక స్థితిపై ఈ సాయం ప్రభావం చూపించేదీ లేనిదీ ఇప్పట్లో చెప్పలేమని..ప్రస్తుతం బాధితులను ఆదుకోవడంపైనే తమ ఫోకస్ పెట్టినట్లు ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్ చెప్పారు. ఆస్ట్రేలియా వాసులు గ్రీన్ బెల్ట్‌గా చెప్పుకునే ఈ ఏరియాలో కార్చిచ్చులు మామూలే అయినా ఇప్పుడు సంభవించిన ప్రమాదం మాత్రం కనివినీ ఎరుగనిది. ఈ ప్రమాదం నుంచి ఆసీస్ వాసులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. విపత్తు నుంచి బైటపడే మార్గాలు వెతుకుతున్నారు. కలిసికట్టుగా కార్చిచ్చుపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు.
ఆస్ట్రేలియా అడవుల్లో రగిలిన కార్చిచ్చు వన్యప్రాణులను చంపేస్తోంది. మన్యంలో ఉండే సమస్త జీవజాలం దావానలంలో సమిధలుగా మారిపోతున్నాయ్. ఇప్పటికే కనీసం 50లక్షల వన్యప్రాణులు ఆహుతి కాగా.. మరెన్నో జంతువుల మనుగడకు ముప్పు ముంచుకొచ్చింది. అటు భారీ వృక్షాలు సైతం ఈ మంటల ధాటికి చిగురుటాకుల్లా క్షణాల్లో బూడిద అయిపోతున్నాయి.
Read More : సరికొత్త ఆవిష్కరణ : కృతిమ మానవులు