చిమ్నీలో చిక్కుకున్న 1000 పక్షులు..సురక్షితంగా వెలికి తీసిన ఫైర్ సిబ్బంది

చిమ్నీలో చిక్కుకున్న 1000 పక్షులు..సురక్షితంగా వెలికి తీసిన ఫైర్ సిబ్బంది

1000 Birds Trapped Inside Chimney

Updated On : May 1, 2021 / 2:54 PM IST

1000 Birds Trapped Inside Chimney : ఎక్కడ కొంచెం మరుగు (ఎవరికి కనబడకుండా చాటుగా ఉండే స్థలం) ఉంటే అక్కడకు పక్షులు గూడులు కట్టుకుంటాయనే విషయం తెలిసిందే. గూడులు కట్టుకోవటమే కాదు ఎక్కడ కాస్త మనుషుల అలికిడి లేని ప్రాంతముంటే దాంట్లోకి పక్షులు చేరుకుంటాయి. కానీ..పాపం కాలిఫోర్నియాలో మాత్రం వందలాది పక్షులు మరుగుగా ఉన్నాయని అనుకున్నాయో లేదా మరి ఎందుకెళ్లాయో తెలీదుగానీ ఓ చిమ్నీ ( పొగగొట్టం)లో చిక్కుకుపోయాయి. అలా 1000 పక్షులకు పైగా ఓ ఇంటి చిమ్నీలో చిక్కుకుపోయాయి. ఆ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి..మా ఇంటి చిమ్నీలో వందలాది పక్షులు ఉన్నాయి…అవి అక్కడే ఉంటే ఏమవుతాయో ఏంటో అని చెప్పాడు.

దాంతో ఫైన్ సిబ్బంది తమకు ఫోన్ చేసిన వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. ఫైర్ ప్లేస్ చిమ్నీలో చూడగా.. గుట్టలు గుట్టలుగా పక్షులు వేలాడుతూ కనిపించాయి. ఇన్ని పక్షులు ఈ చిమ్నీలోకి ఎలా వచ్చాయబ్బా? అంటూ ఆశ్చర్యపోయారు. వాటికి ఎటువంటి ప్రమాదము లేకుండా అత్యంత జాగ్రత్తగా బైటకు పంపించలో ఆలోచించారు. కర్రపెట్టి విదించారు. అలాగైనా అవి మనుషుల అలికిడికి బైటకొస్తాయని అనుకున్నారు. కానీ ఒక్క పిట్ట కూడా కదల్లేదు.

రకరకాలుగా ప్రయత్నించారు? ఏం లాభం లేదు.ఒక్క పిట్టకూడా కదల్లేదు. దాంతో వేరే దారి లేక గోడకు రంథ్రం చేసి ఆ పిట్టల్ని జాగ్రత్తగా బయటకు పంపించారు. గోడకు రంథ్రం చేయగా ఒక్కొక్కటిగా బైటకు వచ్చి గాల్లో ఎగిరిపోయాయి. దాంతో ఫైర్ సిబ్బందితో పాటు ఆ ఇంటి యజమాని కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అలా బైటకొచ్చిన పక్షులు ‘స్విఫ్ట్ (swifts)జాతి’ వని అవి 1000కిపైగా ఉన్నాయని తెలిపారు. కానీ అన్ని పక్షులు ఆ చిమ్నీలోకి ఎలా వెళ్లాయో అర్థం కావట్లేదన్నారు.

దీనిపై ఆ ఇంటి యజమాని మాట్లాడుతూ.. వెయ్యిదాకా స్విఫ్ట్ జాతి పిట్టలు ఫైర్ ప్లేస్ చిమ్నీలో చిక్కుకుని ఉన్నాయి. అవే పోతాయిలే అనుకున్నాను. కానీ మరునాడు చూసినా అవి అక్కడే వేలాడుతూ కనిపించాయి. దాంతో ఇక లాభం లేదనుకుని ఫైన్ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పానని..దాంతో వాళ్లు గోడకు కన్నం పెట్టి వాటిని సురక్షితంగా బైటకు పంపించారని తెలిపారు. పిట్టల ప్రాణాలకు ఎటువంటి హాని జరగకుండా కాపాడినందుకు అందరూ ఫైర్ సిబ్బందిని అభినందించారు.