Fisherman Gets iphones : జాలరి వలకు చిక్కిన ఐఫోన్లు, లాప్‌టాప్ లు

చేపలు పట్టే జాలరికి అదృష్టం లక్కలా అతుక్కున్నట్లుంది. చేపల కోసం వల వేస్తే ఐఫోన్ల బాక్సే దొరికింది.

Fisherman Gets iphones : జాలరి వలకు చిక్కిన  ఐఫోన్లు, లాప్‌టాప్ లు

Fisherman Gets Iphones In Fishing Net

Updated On : December 20, 2021 / 4:17 PM IST

Fisherman gets iphones : అదృష్టం అతనికి లక్కలా అతుక్కున్నట్లుంది. లేదంటే చేపల కోసం వల వేస్తే యాపిల్ ఐ ఫోన్స్ దొరకటమేంటి? చిత్రం కాకపోతే..కానీ అదృష్టవంతుడ్ని చెడగొట్టేవాడు…దురదృష్టవంతుడ్ని బాగు చేసేవాడు ఉండని పెద్దలు అంటుంటారు. అందుకేనేమో..ఓ జాలరి చేపల కోసం వల వేస్తే ఏకంగా ఐ ఫోన్ల గుట్టే దొరికింది. ప్రతీరోజులాగానే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి వ‌ల‌లో లక్షలు విలువ చేసే ఐఫోన్లు, టాప్ టాపులు దొరికాయి. అవేంటో తెలిసిన సదరు జాలరి ఆనందం పట్టలేక ఒక్కసారిగా పడవలో ఎగిరి ఎగిరి గెంతులేశాడు. ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతంలోని జాలరికి ఐఫోన్ల రూపంలో లక్ లక్కలాగా అతుక్కుంది.

Read more : Sharmila fired On KCR : ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే..ప్రభుత్వం వడ్లు కొనేలా చేస్తా : షర్మిల

ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లటం..వలలో పడ్డ చేపల్ని అమ్ముకోవటం చేస్తుంటాడు. రోజులాగానే పడవ వేసుకుని సముద్రంలోకి వెళ్లాడు. సముద్రంలో వల విసిరాడు. కాసేపటికి లాగాడు. వల బరువుగా అనిపించింది. ఆహా చేపలా భారీగా పడ్డాయేమో..ఈరోజు నా పంట పడింది అనుకున్నాడు. ఉత్సాహంగా వల లాగాడు. వల మొత్తం లాగిన తర్వాత అత‌ను చూసేస‌రికి అందులో చేప‌ల‌కు బ‌దులు ఏవో పెట్టెలు క‌నిపించాయి. అవిచూసిన అతను షాక్ అయ్యాడు. ఎక్కువ చేపలు పడ్డాయనుకుంటే ఈ పెట్టెలేంటిరా బాబు నా కష్టమంతా గంగపాలు అయిపోయింని బాధపడ్డాడు.

వలలోంచి పెట్టెలను బయటకు తీసి చూశాడు. అంతే షాక్ అయ్యాడు. ఆ పెట్టెలు ఐఫోన్లవి. యాపిల్ ఐఫోన్లు, మ్యాక్ బుక్ లాప్‌టాపులు ఉన్నాయి. వాటి ఖ‌రీదు ల‌క్ష‌ల్లోనే ఉంటుంది. దాన్ని తన దగ్గరున్న ఫోన్ లో వీడియో తీసి టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. పెట్టెలో ఉన్న ఫోన్లు ఏమాత్రం పాడవలేదని తెలిపాడు వీడియోలో..

Read more : India Omicron : భారత్ లో 161 ఒమిక్రాన్ కేసులు : ఆరోగ్యమంత్రి