చెడ్డి వేసుకుని పెళ్లి చేసుకున్న వరుడు..! ఇంటిముందు క్యూ కట్టిన మీడియా

ఓ పెళ్లిలో వరుడు వేసుకునే బట్టల విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. పెళ్లి కొడుకు కేవలం చెడ్డి మాత్రమే వేసుకుని పెళ్లి చేసుకున్నాడు.చిన్న డ్రాయర్, బనీను తోనే పెళ్లి మండపంలో కూర్చున్నాడు. ఆ చెడ్డితోనే వధువును వివాహం చేసుకున్నాడు.

చెడ్డి వేసుకుని పెళ్లి చేసుకున్న వరుడు..! ఇంటిముందు క్యూ కట్టిన మీడియా

Indonesian Groom Only Shorts On His Wedding

Updated On : April 8, 2021 / 1:40 AM IST

indonesian groom only shorts on his wedding : ఈరోజుల్లో పెళ్లిళ్లలో వధూవరులు డ్రెస్సులు గ్రాండ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. పెళ్లి డ్రెస్సుల్ని స్పెషల్ గా వారి వారి బడ్జెట్ లకు తగినట్లుగా డిజైన్ చేయించుకుంటున్నారు. మధ్య తరగతివారు కూడా వారికి తగినట్లుగా కాస్త గ్రాండ్ గా పట్టు వస్త్రాల్లో మిలమిలా మెరిసిపోతాడని అనుకుంటున్నారు. కానీ..ఓ పెళ్లిలో వరుడు వేసుకునే బట్టల విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. ఎంతగా అంటే పాపం ఆ పెళ్లి కొడుకు కేవలం చెడ్డి మాత్రమే వేసుకుని పెళ్లి చేసుకునేంత. కేవలం చిన్న డ్రాయర్, బనీను తోనే పెళ్లి మండపంలో కూర్చున్నాడు. ఆ చెడ్డితోనే వధువును వివాహం చేసుకున్నాడు. వధువు  సాంప్రదాయ జావానీస్ వివాహ వస్త్రధారణలో ఉంది.

10

 

ఇండోనేషియాలోని తూర్పు జావాలోని ఆ వరుడు పేరు సుప్రాప్తో. ఏప్రిల్ 2న.. ఎలిండా డ్వీ క్రిస్టియానీ అనే యువతిని న్గాన్జుక్ రీజెన్సీలో పెళ్లి చేసుకున్నాడు. వరుడు చెడ్డి తప్ప మరేదీ శరీరంపై వేసుకోలేని పరిస్థితి. కారణం..పెళ్లి నాలుగు రోజులు ఉందనగా ప్రమాదానికి గురయ్యాడు. కాళ్లు, చేతులకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కానీ అప్పటికే పెళ్లి అన్ని ఏర్పాట్లు చేసుకోవడంతో పెళ్లి వాయిదా వేద్దామనుకున్నారు ఇరు కుటుంబాలవారు.

కానీ వరుడు అలా వద్దు..పెళ్లి దగ్గర పడ్డాక పెళ్లి వాయిదా పడితే వధువు గురించి రకరకాలుగా అనుకుంటారు. ఎలాగైనా పెళ్లి జరగాలన్నాడు. కానీ పెళ్లికి బట్టలు వేసుకోలేని పరిస్థితిలో ఉండి ఎలాగ? అని పెద్ద ప్రశ్న వచ్చింది. దానికి వివాహం తరువాత ఇద్దరం కలిసి మెలిసి ఉండాలే గానీ పెళ్లికి ఎటువంటి బట్టలు వేసుకున్నామా? అనేది ముఖ్యం కాదు అని చెప్పాడు. అదీ కూడా కరెక్టే కదా? అనుకుని పెళ్లి ఏర్పాట్లు చేయటం..ముహూర్తానికి వరుడు కేవలం చెడ్డీ మాత్రమే వేసుకుని రావటంతో పెళ్లికి వచ్చినవారంత నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. దీంతో అసలు విషయం తెలిసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

Groom

ప్రమాదం వల్ల జరిగిన ఆపరేషన్ల వల్ల వరుడు చేతులకు కట్లు, కాళ్లకు బ్యాండేజీలతోనే పెళ్లి చేసుకున్నాడు. అన్ని గాయాలతో పెళ్లి అవసరమా అని అతిథులు చెవులు కొరుకున్నా.. వధువరుల పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

11

కాగా చెడ్డీ వేసుకుని పెళ్లి చేసుకున్న వరుడు మాత్రం ఫేమస్ అయిపోయాడు. దీంతో మీడియా ప్రతినిధులు వరుడి ఇంటికి క్యూ కట్టారు. తన భర్త గురించి వధువు ఎలిండా మాట్లాడుతూ.. ‘‘బైకులో పెట్రోల్ కొట్టించేందుకు బయల్దేరిన నా భర్త మార్గమధ్యలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. దీంతో అతడు బైకు మీద నుంచి పడిపోయాడు. కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రాణాలతో బైటపడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. బలమైన గాయాలు తగలటంతో సర్జరీలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన పెళ్లికి మంచి బట్టలు వేసుకోలేకపోయారు’’కానీ మేమిద్దరం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. మేం సంతోషంగా ఉండటమే ముఖ్యం అనుకున్నాం అని చెప్పింది. చెడ్డీతో పెళ్లి చేసుకున్న వరుడు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దాంతో వరుడు కూడా ఫేమస్ అయిపోయాడు.