ఆమే లేకపోతే అమెజాన్ లేదు : ఈ-కామర్స్ సంచలనంలో పార్టనర్
మగాడి విజయం వెనక ఆడది ఉంటుంది అంటారు.. అందరి జీవితాల్లో కాకపోవచ్చు కానీ.. ఈ-కామర్స్ దిగ్గజం విషయంలో మాత్రం ఇది అక్షర సత్యం. అవును ఆమె లేకపోతే అమెజాన్ లేదు అంటారు సీఈవో జెఫ్ బెజోస్. భార్యభర్తలుగా కాకుండా ఓ ఫ్రెండ్స్ గా, బెస్ట్ క్రిటిక్స్, బెస్ట్ పేరంట్స్ గా సాగిన జీవిత విజయానికి ప్రతీక అమెజాన్. భర్త మెజోస్ నుంచి విడాకుల తర్వాత ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఆమె లేకపోతే అమెజాన్ పరిస్థితి ఏంటీ అనే డౌట్స్ ఒకవైపు.. పెట్టిన పెట్టుబడి ఏమౌతోందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ-కామర్స్ దిగ్గజంపై ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి చర్చలు, సందేహాలు ఎన్నో. ఇంతకీ అమెజాన్ సీఈవో బెజోస్ భార్య మెకన్జీ బెజోస్ కు ఎంతకంత పాపులారిటీ, అమెజాన్ విజయంలో ఆమె పాత్ర ఏంటో తెలుసుకుందాం..
ఆమె లేకపోతే అమెజాన్ వచ్చేదా
జనవరి 12, 1964లో మెక్సికోలో జెఫ్ బెజోస్ జన్మించారు. జెజోస్ జన్మించిన ఏడాదిలోనే ఆయన తండ్రి కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయారు. బెజోస్ నాలుగేళ్ల వయస్సులో అతని తల్లి రెండో పెళ్లి చేసుకొంది. బెజోస్ చదువంతా రెండవ తండ్రి పెంపకంలోనే జరిగింది. 1986లో కాలేజీ చదువు పూర్తి అయిన తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని కొన్ని కంపెనీల్లో పనిచేసిన తర్వాత 26 ఏళ్లకే కో కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు.
మెకన్ జీ పాత్ర ఇక్కడ కీలకం
నాలుగేళ్లు అదే కంపెనీలో పనిచేసిన 1994లో ప్రజల్లో పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకాన్ని గమనించి ఓ ఆన్ లైన్ బిజినెస్ ప్రారంభించాలని లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకొంటున్నట్లు తన భార్య మెకన్ జీకి బెజోస్ చెప్పాడు. బెజోస్ నిర్ణయాన్ని ఆమె సమర్థించింది. ఎందుకిదంతా మనికి కంఫర్ట్ లైఫ్ వదులుకొని రిస్క్ అవసరమా అని అందరిలా ఆమె బెజోస్ ని ప్రశ్నించలేదు.
అవసరమైతే నేను ఉద్యోగం చేస్తాను అని భర్తకు ధైర్యం చెప్పింది. కటుంబ భాధ్యతను నేను చూసుకొంటానని భర్త ఆలోచనలను ప్రోత్సహించింది. తన భర్త ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా నిలబడతాడని నమ్మింది. ప్రతి విసయంలోనూ తనకు మెకన్ జీ తోడు ఉండటం వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని, మెకన్ జీ లేకుంటే అమెజాన్ లేదని బెజోస్ అనేక సందర్భాల్లో తెలిపారు.
దంపతులంటే వీరిద్దరిలా ఉండాలని వందలాది మాగజెన్లు కూడా కథనాలు పబ్లిష్ చేశాయి. అమెజాన్ స్థాపన వెనుక మెకన్ జీ కష్టం పెద్దగా ప్రపంచానికి తెలియకపోవచ్చు. అమెజాన్ లో మెకన్ జీ ప్రముఖ పాత్ర పోషించింది. అయితే భార్యా భర్తల మధ్య చీలక వల్ల అమెజాన్ పై బెజోస్ కంట్రోల్ తప్పుబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సమయంలో ఇన్వెస్టర్లు కూడా ఈ విషయాన్ని చాలా ఆశక్తిగా గమనిస్తున్నారు. అయితే వారిద్దరూ ఫ్రెండ్లీగానే విడిపోతున్నారని, బిజినెస్ ని గందరగోళం పరిచే ఉద్దేశం మెకన్ జీకి ఏమాత్రం లేనట్లు తెలుస్తోందని బిజినెస్ ఎనలిస్ట్ మైఖేల్ పశ్చర్ తెలిపారు.