Johnson COVID Vaccine : బాబోయ్.. ఒళ్లంతా దద్దుర్లు, ఎర్రబారిన చర్మం, భరించలేని నొప్పి.. ఆ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి తీవ్ర అస్వస్థత

Johnson COVID Vaccine : బాబోయ్.. ఒళ్లంతా దద్దుర్లు, ఎర్రబారిన చర్మం, భరించలేని నొప్పి.. ఆ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి తీవ్ర అస్వస్థత

Johnson Covid Vaccine

Updated On : March 31, 2021 / 2:17 PM IST

Johnson COVID Vaccine : జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. అతడి ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి. భరించలేని నొప్పి కలిగింది. చర్మం ఎరుపు రంగులో మారింది. ఒళ్లంతా నవ్వలు. మొత్తంగా అతడు నరకం చూశాడు పాపం. ఈ ఘటన వర్జీనియాలో చోటు చేసుకుంది. అతడి పేరు రిచర్డ్ టెరెల్. వయసు 74ఏళ్లు. ఇటీవలే ఆయన జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. నాలుగు రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత రియాక్షన్ కనిపించింది. శరీరంలో వింత లక్షణాలు కనిపించాయి. ఒళ్లంతా దద్దుర్లు.

‘చంకలో కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఆ తర్వాత దురద మొదలైంది. ఆపై దద్దుర్లు వచ్చాయి. అవి వాచాయి. శరీరం రంగు ఎర్రగా మారిపోయింది. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. చర్మం అంతా ఒలిచినట్టు అయిపోయింది. చాలా మంటగా ఉంది. దురదగా అనిపించింది. ఎప్పుడైనా నా చేతులు లేదా కాళ్లు వంచినప్పుడు విపరీతమైన నొప్పి కలిగేది. బాగా గోకాలని అనిపించేది. నరకం చూశాను.” అని రిచర్డ్ వాపోయాడు.

పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆ పెద్దాయన డాక్టర్ ని ఆశ్రయించాడు. డాక్టర్ ఆయనను ఎమర్జెన్సీ వార్డుకి తరలించి చికిత్స అందించారు. వ్యాక్సిన్ లో రియాక్షన్ కారణంగానే ఆయనకు ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. ఆయనకు అన్ని టెస్టులు చేశాము. ఆయన కిడ్నీలు, లివర్ బాగానే ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా ఇలా జరిగిందని గుర్తించాము అని డాక్టర్లు వివరించారు. మనిషి దేహంలో అతి పెద్ద అవయవం చర్మం. ఎప్పుడైతే చర్మం ఇలా ఎర్రబారుతుందో అప్పుడు చాలా ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోతాము. కాగా, భయపడాల్సింది ఏమీ లేదని.. జాన్సన్ వ్యాక్సిన్ సురక్షితమైనదే అని, ఇలాంటి రియాక్షన్లు చాలా అరుదుగా జరుగుతాయని డాక్టర్లు తేల్చారు.