Muslim Spiritual Leader: నాశిక్ సమీపంలో ముస్లిం మత గురువు దారుణ హత్య

 సూఫీ బాబాగా పిలిచే ముస్లిం మత గురువును గుర్తు తెలియని వ్యక్తులు నాశిక్ ప్రాంతంలో దారుణ హత్య చేశారు. అఫ్ఘనిస్తాన్ కు చెందిన 35ఏళ్ల మత గురువు మంగళవారం నాశిక్ లోని యోలా పట్టణానికి వచ్చాడు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

Muslim Spiritual Leader: నాశిక్ సమీపంలో ముస్లిం మత గురువు దారుణ హత్య

Updated On : July 6, 2022 / 8:11 AM IST

Muslim Spiritual Leader: సూఫీ బాబాగా పిలిచే ముస్లిం మత గురువును గుర్తు తెలియని వ్యక్తులు నాశిక్ ప్రాంతంలో దారుణ హత్య చేశారు. అఫ్ఘనిస్తాన్ కు చెందిన 35ఏళ్ల మత గురువు మంగళవారం నాశిక్ లోని యోలా పట్టణానికి వచ్చాడు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

యోలా టౌన్ MIDC ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్ లో సాయంత్రం సమయంలో ఘటన జరిగింది. ముంబైకు 200కిలోమీటర్ల దూరంలోని ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు మృతుడ్ని ఖ్వాజా సయ్యద్ చిష్టీగా గుర్తించారు.

దుండగులు నుదుటిపై కాల్పులు జరపడంతో అక్కడే మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. సూఫీ బాబాను హత్య చేసిన అనంతరం, అతనికి సంబంధించిన SUVని తీసుకుని దుండగులు పారిపోయారు. అనుమానస్పద వ్యక్తుల హత్య కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read Also: బతికి ఉండగానే మత గురువుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం