PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం..!

PM Narendra Modi : నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్‌ టినుబు ఆహ్వానం మేరకు 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నైజీరియా చేరుకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చించనున్నారు.

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం..!

Nigeria to honour PM Narendra Modi with GCON award

Updated On : November 17, 2024 / 6:07 PM IST

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. నైజీరియా మోదీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (GCON) అవార్డుతో సత్కరించనుంది. 1969లో క్వీన్ ఎలిజబెత్‌‌కు కూడా నైజీరియా ఇదే అవార్డును ప్రదానం చేసింది.

ఆ తర్వాత ఈ అవార్డును అందుకోనున్న విదేశీ ప్రముఖుడిగా మోదీకి ప్రత్యేక స్థానం దక్కింది. విదేశాల్లో ప్రధాని మోదీ అంతర్జాతీయ అవార్డులను అందుకోగా.. అందులో ఇది 17వ పురస్కారం. నైజీరియాలోని అబుజా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్‌వో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేశారు.

నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్‌ టినుబు ఆహ్వానం మేరకు 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నైజీరియా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చించనున్నారు. జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్‌ వెళ్లనున్నారు. ఆ తర్వాత వివిధ సభ్యదేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.

ఈ నెల 18, 19 తేదీల్లో రియో డీ జనీరోలో జరగబోయే శిఖరాగ్ర సమావేశానికి కూడా మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకానున్నారు. గయానా దేశాధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఈ నెల 19న మోదీ గయానాకు చేరుకోనున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు మోదీ అక్కడే ఉండనున్నారు.

Read Also : Allu Arjun : పాట్నా గడ్డ మీద అడుగు పెట్టిన అల్లు అర్జున్.. ఎయిర్ పోర్ట్ వద్ద భారీగా జనాలు, మీడియా..