మోడీకి అరుదైన గౌరవం: యూఏఈ అత్యున్నత పురస్కారం  

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 08:56 AM IST
మోడీకి అరుదైన గౌరవం: యూఏఈ అత్యున్నత పురస్కారం  

Updated On : April 4, 2019 / 8:56 AM IST

మన ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యంత అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) దేశపు అత్యంత అరుదైన పురస్కారమైన ‘జయాద్ మెడల్’ను ప్రకటించింది. భారత్-యూఏఈ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు మోదీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయాద్ ప్రకటించారు.

యూఏఈ తమ దేశపు అత్యున్నత పురస్కారాన్ని పలు దేశాధినేతలకు ఇచ్చి గౌరవించింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్.డబ్ల్యూ. బుష్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కల్ వంటి ప్రముఖులు మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు. తాజాగా ప్రధాని మోడీకి ఈ గౌరవాన్ని ప్రకటించటంతో వారి సరసన మన ప్రధాని కూడా చేరటం విశేషం. 

ఇజ్రాయిల్ పువ్వుకు మోడీ పేరు 
భారత స్వాతంత్రానంతరం భారత ప్రధానులెవ్వరు ఇజ్రాయిల్ లో పర్యటించలేదు. కానీ 2017లో ఇజ్రాయెల్లో పర్యటించిన ప్రధాని మోడీకి  ఘన స్వాగతం లభించింది. అంతేకాదు, ఇజ్రాయెల్ ఆయనకు అరుదైన గౌరవం ఇచ్చింది. ఆ దేశానికి చెందిన క్రిసాన్తిమమ్ జాతికి చెందిన ఓ పుష్పానికి మోడీ పేరు పెట్టింది. ఆపువ్వును అప్పటి నుంచి  ‘మోడీ’ పువ్వుగా  పిలుస్తున్నారు.  డాన్జిగర్ ఫ్లవర్ ఫార్మ్‌ను మోడీ సందర్శించిన సందర్భంగా ఈ అరుదైన గౌరవం లభించింది.
కాగా మోడీకి ఇజ్రాయిల్ లో అత్యంత ఘనమైన స్వాగతం దక్కింది. గతంలో అమెరికా అధ్యక్షుడు, పోప్‌లకు ఇజ్రాయెల్ దేశాధినేతలు ఇచ్చే స్వాగత మర్యాదలు ప్రధాని మోడీకి దక్కాయి.