లాక్ డౌన్ వ్యతిరేకిస్తే కుక్కల బోనులోకి..

లాక్ డౌన్‌ను ఉల్లంఘించిన వారిలో భయం పుట్టాలని చట్టం పక్కన పెట్టి పోలీసులు తీసుకుంటున్న చర్యలను చూస్తూనే ఉన్నాం. ఫిలిప్పైన్స్ వాసుల్లో మరింత నిర్లక్ష్యం కనిపిస్తుందట. ఈ మేరకు వారిని కుక్కల బోనులో పెట్టాలని నిర్ణయించారు. బోనులో నింపేసి మిట్ట మధ్యాహ్నం వరకూ అందులోనే ఉంచుతున్నారు. చైనా, ఇండియా లాంటి దేశాలు లాక్ డౌన్ కఠినతరంగా నిర్వహించాలని పౌరులను చితకబాదుతున్నారు.
‘పోలీసులు, స్థానిక పౌరులు హక్కుల హక్కులను తప్పకుండా గౌరవించాలి. కర్ఫ్యూ, ఇతర ఆరోగ్యకర నిబంధనలను ఉల్లంఘిస్తే ఫిలిప్పైన్స్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం ఉంది’ అని డిప్యూటీ ఆసియా డైరక్టర్ ఫిల్ రాబర్ట్‌సన్ అంటున్నారు. ‘అదే క్రమంలో ప్రజలపై ఏదైనా హింసాత్మక ఘటనలు చేపడితే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి’ అని ఆయన సూచించారు.
లాక్ డౌన్ ను ఉల్లంఘించినందుకు మనీలా అనే ప్రాంతంలో వ్యక్తిని షూట్ చేయడంతో మోటార్ బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. దీనిపై పోలీసులు వివరణ ఇస్తూ ఆ వ్యక్తి కూడా గన్ ఫైర్ చేస్తున్నాడని తెలిసి తాము ఫైర్ చేశామని ఈ ఘటనలో అతను మృతి చెందాడని తెలిపారు. మరో ప్రాంతంలో మైనర్ల గ్రూప్ లాక్ డౌన్ సమయంలో బయటకు వచ్చారని కుక్కలో బోనులో 30నిమిషాల పాటు కూర్చోబెట్టడంతో పోలీసులపై యాక్షన్ తీసుకున్నారు పోలీసులు.
ఈ ఘటన ఫేస్ బుక్ లో పోస్ట్ అవడంతో వైరల్ గా మారింది. ఆ పోస్టులో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇదే పని చేస్తామంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఆంబ్రోసియో అనే పోలీస్ అధికారి క్షమాపణ చెప్పారు.
Also Read | కరోనాను వదలని సైబర్ నేరగాళ్లు: ఈ లింక్‌లు ఓపెన్ చేస్తే అకౌంట్లలో డబ్బులు మాయం