Ukraine Russia War: ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. తాజా ప్రసంగంలో పుతిన్
ఈ విషయంపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరో పక్క ఉక్రెయిన్‌పై రష్యా భయంకరంగా బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ రష్యాను రక్తపిపాసి అని సంభోదించారు. రష్యా జరిపిన తాజా దాడుల్లో 25 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇలా ఉగ్రవాదులు మాత్రమే వ్యవహరించగలరని, పుతిన్ రక్తపిపాసి అని జెలెన్స్కీ విమర్శించారు.

Putin Says 4 New Regions As Russia Annexes Ukraine Territory
Ukraine Russia War: ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనమైనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. తాజాగా క్రెమ్లిన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఏడు నెలల ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. మరో విశేషం ఏంటంటే.. ఈ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతనే విలీనాలు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో పాశ్చాత్య దేశాలు సహా ఉక్రెయిన్ ప్రభుత్వంపై పుతిన్ మండిపడ్డారు. అంతర్జాతీయ చట్టాలను వారు ఉల్లంఘించారని, బలవంతంగా అక్కడి ప్రజలపై అధికారం చెలాయించారని పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరో పక్క ఉక్రెయిన్‌పై రష్యా భయంకరంగా బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ రష్యాను రక్తపిపాసి అని సంభోదించారు. రష్యా జరిపిన తాజా దాడుల్లో 25 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇలా ఉగ్రవాదులు మాత్రమే వ్యవహరించగలరని, పుతిన్ రక్తపిపాసి అని జెలెన్స్కీ విమర్శించారు.
BSP Supremo: ఆర్ఎస్ఎస్ను సాంత్వన పరిచేందుకే పీఎఫ్ఐపై నిషేధం.. బీజేపీపై మండిపడ్డ మాయావతి