Russia-Ukraine War Day 3 Live Updates : కీవ్‌ దగ్గర్లో రష్యా బలగాలు.. గన్స్‌తో పౌరుల కవాతు.. తగ్గేదేలే అన్న జెలెన్‌స్కీ

తనను షిఫ్ట్ చేయడం కాదు.. ఆయుధాలు ఇచ్చి ఆదుకోవాలని అమెరికాపై స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. యుక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది.  

Russia-Ukraine War Day 3 Live Updates : కీవ్‌ దగ్గర్లో రష్యా బలగాలు.. గన్స్‌తో పౌరుల కవాతు.. తగ్గేదేలే అన్న జెలెన్‌స్కీ

Russia Ukrain War Tensions Live Updates

Updated On : February 26, 2022 / 5:03 PM IST

Russia-Ukraine War Day 3 Live Updates : రష్యన్ బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ వైపు దూసుకొస్తున్నాయి. కీవ్ కు అత్యంత సమీపంలోకి వచ్చేశాయి. ఏ క్షణంలోనైనా రాజధాని కీవ్ ను రష్యన్ బలగాలు హస్తగతం చేసుకుంటాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు.. కీవ్ గగన తలంలో ఎయిర్ స్ట్రైక్ సైరన్ల మోత మోగుతోంది. బాంబులు, ఫిరంగుల చప్పుళ్లతో అల్లకల్లోల వాతావరణం కనిపిస్తోంది. జనం అంతా బంకర్లలో తలదాచుకున్నారు. తాను ఎక్కడికీ పారిపోనని చెప్పిన యుక్రెయిన్ అధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీ కీవ్ లోనే ఉన్నారు. తనను షిఫ్ట్ చేయడం కాదు.. ఆయుధాలు ఇచ్చి ఆదుకోవాలని అమెరికాపై స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. యుక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది.