Russian – Ukraine: ‘ప్రభుత్వాలు చొరవ తీసుకుని మా పిల్లలను తీసుకురండి’ – తెలుగు కుటుంబం

యుక్రెయిన్ చదువుకునేందుకు వెళ్లిన భారత విద్యార్థులు అక్కడే ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు ఆవేదనతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎయిరిండియా విమానంలో తొలి బ్యాచ్ ను రొమేనియా...

Russian – Ukraine: ‘ప్రభుత్వాలు చొరవ తీసుకుని మా పిల్లలను తీసుకురండి’ – తెలుగు కుటుంబం

Ukraniane

Updated On : February 26, 2022 / 11:01 AM IST

Russian – Ukraine: యుక్రెయిన్ చదువుకునేందుకు వెళ్లిన భారత విద్యార్థులు అక్కడే ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు ఆవేదనతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎయిరిండియా విమానంలో తొలి బ్యాచ్ ను రొమేనియా నుంచి స్వదేశానికి తరలించనున్నారు. విమాన సర్వీసును కేటాయించినప్పటికీ ఆ టిక్కెట్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వాలు చొరవతీసుకుని తమ పిల్లలను ఇండియాకు చేర్చాలంటూ పేరెంట్స్ వేడుకుంటున్నారు.

ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలోని మంచాలకు చెందిన వైష్ణవి కుటుంబం ఆమెను ఇక్కడకు తీసుకురమ్మంటూ మొరపెట్టుకుంటుంది. జిప్రోజియా యూనివర్సిటీలో ఉన్నత చదువుల కోసం వైష్ణవి యుక్రెయిన్ వెళ్లింది. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నఆమె.. ఇండియాకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వైష్ణవి కుటుంబం నివాసం ఉంటుంది.

Read Also : యుక్రెయిన్-రష్యా వార్.. జెలెన్‌స్కీని రక్షించేందుకు రంగంలోకి అమెరికా

‘2018లోనే MBBS చదువు కోసం యుక్రెయిన్ వెళ్లింది. రష్యా – యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంద’ని తల్లిదండ్రులు వివరించారు.

ఈ క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లయిట్ టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయని.. రూ.35వేలు ఉన్న టికెట్ ధర ఒక్కసారిగా రూ.85 వేలకు పెరిగిపోయిందని తమ పిల్లలు చెబుతున్నారంటూ పేరెంట్స్ వాపోయారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ పిల్లలను స్వదేశానికి తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.