శబరిమల ఆలయంలో పూజలు ఎప్పటినుంచి ప్రారంభమంటే!

  • Published By: dharani ,Published On : June 11, 2020 / 02:11 AM IST
శబరిమల ఆలయంలో పూజలు ఎప్పటినుంచి ప్రారంభమంటే!

Updated On : June 11, 2020 / 2:11 AM IST

జూన్‌ 14 నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ రోజు ఆలయంలో నెలవారీ పూజలు నిర్వహించనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్‌ వాసు వెల్లడించారు. జూన్‌ 19 నుంచి ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. అంతేకాదు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవారు రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా కరోనా నెగెటివి సర్టఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. 

వర్చువల్ క్యూ సిస్టమ్ నమోదు చేసుకున్న భక్తులు మాత్రమే ఆలయంలోకి రావడానికి అర్హులు. ICMR గుర్తింపు పొందిన ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తేనే అనుమతిస్తామని కూడా పేర్కన్నారు. అంతేకాదు పరిమితి సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నామని, భక్తులు తప్పకుండా మాస్క్ ధరించాలని నూచించారు.  

Read: Google Mapsలో అమితాబ్ వాయిస్ ?