37వేల కిలోమీటర్ల నుంచి సెల్ఫీ.. ఎంత అందంగా ఉందో

  • Published By: vamsi ,Published On : March 6, 2019 / 08:16 AM IST
37వేల కిలోమీటర్ల నుంచి సెల్ఫీ.. ఎంత అందంగా ఉందో

Updated On : March 6, 2019 / 8:16 AM IST

ఇజ్రాయిల్ స్పేస్ క్రాఫ్ట్ తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టబోతుండగా.. అంతరిక్షంలో తన మొదటి సెల్ఫీ ఫోటోను తీసి భూమికి పంపింది. భూమికి దాదాపు 20 వేల మైళ్ల (37 వేల కిలోమీటర్లు) దూరం నుంచి ఈ అద్భుతమైన ఫొటోను తీసిన స్పేస్ క్రాఫ్ట్ దానిని భూమికి పంపగా అది చాలా అందగా కనిపిస్తుంది. స్పేస్ క్రాఫ్ట్ తీసిన సెల్ఫీలో రోబోటిక్‌ లాండర్‌తో పాటు వెనుకభాగంలో దగదగా వెలుగుతున్న భూమి స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : సరిదిద్దుకోండి : క్రెడిట్ కార్డుపై చేసే 6 తప్పులు ఇవే

స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలో తీసిన ఈ సెల్ఫీలో భూమిపై ఆస్ట్రేలియా భూభాగం స్పష్టం కనిపిస్తుండగా మిషన్‌ బృంద సభ్యులు ఇజ్రాయిల్ టు మూన్ అనే ట్విట్టర్ పేజ్ ద్వారా ఆ ఫొటోను పోస్ట్ చేశారు. స్పేస్ క్రాఫ్ట్ తీసి పంపిన ఫొటోలో స్పేస్‌క్రాఫ్ట్‌పై ఇజ్రాయెల్‌ జాతీయ పతాకంతోపాటు.. ‘చిన్నదేశం.. పెద్ద కలలు’(Small Country, Big Dreams) అని రాసి ఉన్నమ సందేశం కూడా కనిపిస్తోంది. 

ఇజ్రాయెల్‌ తన తొలి మూన్‌ లాండర్‌ను ఫ్లోరిడాలోని కేఫ్‌ కానవెరాల్‌ నుంచి రెండు వారాల క్రితం విజయవంతంగా ప్రయోగించింది.  ఏప్రిల్‌ 11న చంద్రునిపై ఈ స్పేస్ క్రాఫ్ట్ దిగనుంది. 585 కిలోల బరువున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా పంపించారు.

ఇప్పటివరకూ రష్యా, అమెరికా, చైనాకు చెందిన స్పేస్‌క్రాఫ్టులు మాత్రమే 3,84,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రునిపై దిగాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఇజ్రాయిల్ కూడా చేరనుంది. అయితే ఇండియా కూడా చంద్రయాన్-2 ద్వారా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. అలాగే జపాన్ కూడా Small Lunar Lander(SLIM) అనే స్పేస్ క్రాఫ్ట్ ను 2021లో ప్రయోగించాలని సిద్ధం అవుతుంది. 
Also Read : దబిడిదిబిడే : బాలకృష్ణనే అడ్డుకున్న మహిళలు