Breastmilk: అమెరికాలో అమ్మపాల సంక్షోభం..నా పాలు అమ్ముతానంటున్న ఓ తల్లి
అమెరికాలో అమ్మపాల సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో నా పాలు అమ్ముతానంటున్న ఓ తల్లి ముందుకొచ్చింది.

Us Mother Selling 118 Litres Of Her Breast Milk
US Mother Selling 118 Litres Of Her Breast Milk : పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు తప్ప మరేమి పట్టవద్దని డాక్టర్లు చెబుతుంటారు. ఎందుకంటే అమ్మపాలలో ఉన్నన్నిపోషక విలువలు మరి దేంట్లోనే ఉండవు. బిడ్డ బొజ్జ నింపే తల్లిపాలు ఆ బిడ్డ ఆరోగ్యంగా పెరగటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి అమ్మపాలు లేక ఎంతోమంది బిడ్డలు అల్లాడిపోతున్నారు. అటువంటి బిడ్డల కోసమే తల్లిపాల బ్యాంకులు కూడా అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో ఈ సమస్య ఉన్నా..అమెరికా కంటే తక్కువనే చెప్పాలి. అందుకే అక్కడ బేబీ ఫార్ములాను ఉపయోగిస్తారు. ఈ బేబీ ఫార్ముల ఒక పౌడర్‌లా ఉంటుంది. అమెరికాలోని మిలియన్ల కుటుంబాలు తమ చిన్నారుల కోసం ఈ ఫార్ములాపైనే ఆధారపడుతుంటాయి. అటువంటి అమెరికాలో బేబీ ఫార్ములా స్టాక్ తగ్గిపోవటంతో బిడ్డలకు అమ్మపాల కొరత ఏర్పడింది.
Also read : Petrol price India : అమెరికాతోపాటు ఆరు దేశాల కంటే భారత్‌లోనే పెట్రోల్ ధర అధికం
2000 ఫిబ్రవరిలో అమెరికాలో బేబీ ఫార్ములాను ఉత్పత్తి చేసే ఓ ప్రధాన సంస్థ మూతపడడంతో బిడ్డలకు తల్లిపాల (బేబీ ఫార్ములా)కొరత ఏర్పడింది. ఈ కొరత ఏకంగా అమెరికాలో పెద్ద సంక్షోభానికి దారి తీసింది. కాగా ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఓ తల్లి ముందొక్చింది. తన పాలను అమ్ముతాను అంటోంది. ఏకంగా 4000 ఔన్సులు అంటే 118 లీటర్ల పాలను అమ్మటానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది.
ఆ తల్లిపేరు అలిస్సా చిట్టి. అమెరికాలో ఉండే అలిస్సా తన పాలను ఫ్రిజర్స్‌లో స్టోర్ చేస్తోంది. వీలైనంత ఎక్కువ మందికి తల్లి పాలను అందించాలని అనుకున్నానని అందుకే నా పాలను స్టోర్ చేస్తున్నానను అని అలిస్సా చెప్పుకొచ్చింది. ఔన్సుకు పాలు ఒక డాలర్ ధరకు అమ్మాలని నిర్ణయించానని అలిస్సా తెలిపింది. దీని కోసం పాలు అవసరమైన చిన్నారుల తల్లిదండ్రులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది.
Also read : Water : ఆ ఊరిలో మగ పిల్లలకు పెళ్లి అవటం కష్టం
కాగా..అమెరికాలో తల్లి పాలను ఆన్‌లైన్‌లో విక్రయించడం చట్ట బద్దం. అయితే దీనివల్ల కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పాలు అందించిన మహిళలకు అంటు వ్యాధులు ఉంటే అవి తాగిన చిన్నారులకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.