Covid vaccine : వెడ్డింగ్ డ్రెస్ తో వచ్చి వ్యాక్సిన్ వేయించుకుని పెళ్లిచేసుకోవటానికి వెళ్లిన వధువు

Covid vaccine : వెడ్డింగ్ డ్రెస్ తో వచ్చి వ్యాక్సిన్ వేయించుకుని పెళ్లిచేసుకోవటానికి వెళ్లిన వధువు

Us Woman Wedding Gown To Get Covid Vaccine

Updated On : April 19, 2021 / 12:27 PM IST

us woman wedding gown to get covid vaccine : కరోనా..కరోనా..కరోనా. ప్రపంచంలో ఎక్కడ విన్నా ఇదే మాట. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఈ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా మార్చేసిందంటే..ఆర్థికరంగాన్ని అతలాకుతలం చేసిపారేసింది. విద్యారంగాన్ని చిన్నాభిన్నం చేసేసింది. జీవనశైలిలో పెను మార్పులు తెచ్చింది. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అంటూ వార్నింగ్ లు ఇస్తూనే ఉంది. అలాగే వివాహాలు జరిగే సంప్రదాయాల్లో ఈ కరోనా తెచ్చిన మార్పుల వల్ల ఎన్నో వింత వింత వివాహాలు జరగటం చూస్తున్నాం. వింటున్నాం. కరోనా భయం అలా ఉంది మరి.

సాధారణంగా పెళ్లి కూతుళ్లు మేకప్ అయి వివాహాల వేదికల వద్దకు వెళుతుంటారు. కానీ ఈ కరోనా కాలంలో సీన్ రివర్స్ అయ్యింది. ఓ పెళ్లి కూతురు పెళ్లి బట్టలతో ముస్తాబై కరోనా వ్యాక్సిన్ వేసే సెంటర్ కు వచ్చి టీకా వేయించుకుని..అటునుంచి అటే పెళ్లి వేదిక వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుంది. దటీజ్ కరోనా కాలపు పరిస్థితులు అనేలా ఉంది..ఈ వ్యవహారం చూస్తుంటే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వల్ల ఆయా దేశాల..రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో అమెరికాలోని బాల్టీమోర్ ప్రాంతానికి చెందిన ఒక యువతి వినూత్న రీతిలో టీకా వేయించుకుంది. దీనికి సంబంధంచిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొన్ని గంటల్లో పెళ్లి చోసుకోబోతున్న సారా అనే వధువు వెడ్డింగ్ గౌనులో వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చి కరోనా టీకా వేయించుకుంది. ఆ తరువాత అక్కడనుంచే డైరెక్ట్ గా వివాహ వేదిక వద్దకు వెళ్లి వివాహం చేసుకుంది. కరోనా నిబంధనల్లో భాగంగా అతి కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో సారా వివాహం నిరాడంబరంగా జరిగింది. టీకా వేయించుకున్న సారా దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవి వైరల్ అయ్యాయి. సారా చాలా బాధ్యతగా వ్యవహరించిందనీ..అందరూ ఇలాగే చేయాలని పలువురు ప్రశంసిస్తున్నారు.