Bangladesh : ఇదేం వెడ్డింగ్ కార్డురా నాయనా.. పెళ్లికి వెళ్లాలంటే రీసెర్చ్ చేయాల్సిందే!

పెళ్లి తేదీ ఖరారు కాగానే వెడ్డింగ్ కార్డు డిజైన్ చేయిస్తారు. చాలామంది తమ పెళ్లి వేడుకు వినూత్నంగా ఆహ్వానించాలని కోరుకుంటారు. అలా ఓ జంట వెడ్డింగ్ కార్డు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Bangladesh : ఇదేం వెడ్డింగ్ కార్డురా నాయనా.. పెళ్లికి వెళ్లాలంటే రీసెర్చ్ చేయాల్సిందే!

Bangladesh

Bangladesh : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ మధురమైన వేడుక. పెళ్లి తేది ఖరారు అయ్యాక మొట్టమొదటగా చేసే పని పెళ్లికార్డులు ప్రింట్ చేయించడం. పెళ్లికార్డులు అందంగా, ఆకర్షణీయంగా.. అందరికంటే భిన్నంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. బంగ్లాదేశ్‌లో ఓ జంటకు పెళ్లైపోయింది. కానీ పెళ్లికి ముందు పంచిన వెడ్డింగ్ కార్డు వినూత్నంగా ఉండటమే కాదు.. రీసెర్చ్ పేపర్ కంటే తక్కువగా లేదు. వైరల్ అవుతున్న ఆ పెళ్లి కార్డులో అసలు ఏముంది.

Also Read : బాలీవుడ్ పని అయిపోయింది.. తెలుగువారు ఏలబోతున్నారు.. మల్లారెడ్డి కామెంట్స్ వైరల్

@rayyanparhlo అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్ జంట సంజన తబస్సుమ్ స్నేహ, మహ్జీబ్ హొస్సేన్ ఇమోన్‌ల పెళ్లి కార్డు అది. ఈ జంట అక్టోబర్ 14 న పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి శుభలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డులో జంట పేర్లు, వేదికతో పాటు పెళ్లి ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్డ్‌లో ఖురాన్ శ్లోకాలతో పాటు వారు మొదట కలిసిన ప్రదేశం, వారి పరిచయం, వివాహ ప్రక్రియ వివరాలు మొత్తం వివరించారు. చివర్లో ఖురాన్ శ్లోకాలు ఎక్కడ నుండి తీసుకోబడ్డాయో కూడా సూచిస్తుంది.

Also Read: రైనా, ఓజాకు ధోని విందు.. సాక్షి వెరైటీ ఎక్స్‌ప్రెష‌న్ వైరల్

నవంబర్ 25 షేర్ ఈ ట్వీట్ పోస్ట్ చేశారు. మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘ఇద్దరు పరిశోధకులు పెళ్లి చేసుకుంటున్నారని అర్ధమైంది’ అని.. ‘ఇది వెడ్డింగ్ కార్డులా లేదు.. రీసెర్చ్ పేపర్‌లా ఉంది’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ జంట పెళ్లి కార్డు వాళ్లిద్దరూ ఒక్కటైన తర్వాత సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. ఈ కార్డుని చూసిన తర్వాత మరి కొంతమందికి కొత్త కొత్త ఐడియాలు వచ్చిన ఆశ్చర్యం లేదు.