వెస్టిండీస్ టార్గెట్ 171 రన్స్ : టీ20ల్లో కోహ్లి సరికొత్త రికార్డ్
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్ తో రెండో టీ20లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గెలవాలంటే వెస్టిండీస్ 171 పరుగులు

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్ తో రెండో టీ20లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గెలవాలంటే వెస్టిండీస్ 171 పరుగులు
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్ తో రెండో టీ20లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గెలవాలంటే వెస్టిండీస్ 171 పరుగులు చేయాలి. భారత బ్యాట్స్ మెన్ లో శివం దూబే(54, 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. రిషబ్ పంత్ 33 పరుగులు(నాటౌట్) పర్వాలేదనిపించాడు. తొలి టీ20లో అదరగొట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఈ మ్యాచ్ లో 19 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. విండీస్ బౌలింగ్ లో విలియమ్స్, వాల్ష్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ టీమిండియా వశం అవుతుంది.
టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన విరాట్ సేన.. 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ప్రమోషన్ పొందిన శివమ్ దూబే హాఫ్ సెంచరీతో రాణించాడు. పంత్ పర్లేదనిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ అంతగా రాణించలేదు.
కాగా, ఈ మ్యాచ్ లో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. విండీస్ తో మ్యాచ్ లో 19 పరుగులు సాధించడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(2563) చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(2562) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇద్దరి మధ్య కేవలం ఒక్క పరుగు మాత్రమే వ్యత్యాసం. తర్వాతి మ్యాచ్‌లో సమీకరణాలు మారొచ్చు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లి, రోహిత్‌లు ఉండగా.. మార్టిన్ గప్టిల్(2463-న్యూజిలాండ్), షోయాబ్ మాలిక్(2263-పాకిస్తాన్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.