ఈ సూర్యగ్రహణంతో కరోనా వైరస్ అంతమైపోతుందా? సైంటిస్టులు ఏమంటున్నారు?

గ్రహణాలపై మూఢనమ్మకాలు ఎప్పటినుంచో ఉన్నాయి. రేపు రాబోయే సూర్యగ్రహణంతో కరోనా అంతమైపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కరోనా అంతమయ్యే సమయం దగ్గరలో పడిందని, ఇక అందరూ ఊపిరి పీల్చుకోవచ్చని వాట్సాప్ సహా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గ్రహణం ఏర్పడిన సమయంలో ప్రమాదకర కాంతి భూమిపై ఉన్న కరోనా వైరస్‌ను అంతం చేసేస్తుందని అంటున్నారు. అంతేకాదు.. జూన్ 21 (ఆదివారం) అరుదైన జ్వాలావలయ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే దీనిపై చెన్నైకి చెందిన ఓ శాస్త్రవేత ఏమంటున్నారో ఆయన మాటల్లోనే…
గ్రహాల మధ్య సర్దుబాట్లతోనే కరోనా వైరస్ పుట్టకొచ్చిందని అంటున్నారు. డిసెంబర్ 26 నాటి సూర్యగ్రహణానికి వైరస్ ప్రబలడానికి సంబంధం ఉందని చెన్నైకి చెందిన అణు శాస్త్రవేత్త సుందర్ కృష్ణ అంటున్నారు. గ్రహణసమయంలో సూర్యుడి చుట్టూ కనిపించే వలయం (కరోనా)కు సంబంధం ఉందని చెబుతున్నారు. రాబోయే సూర్య గ్రహణంతో కరోనా అంతమవుతుందని అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమై 6 నెలలు కావొస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని అంతం చేసేందుకు పెద్ద ఎత్తునా వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. OXford ట్రయల్స్, కోవిడ్ -19 చికిత్సా ఔషధాలపై చేసిన అధ్యయనాలను పట్టించుకోవడం లేదు. ప్రపంచమంతా చేయవలిసింది జూన్ 21 వరకు వేచి ఉండటమేనని అంటున్నారు. తరువాతి సూర్యగ్రహణం నేచురల్ రెమిడీగా పనిచేస్తుంది వైరస్ వదిలిపోతుందని గట్టిగా చెబుతున్నారు.
వ్యాధి వ్యాప్తికి, గత డిసెంబర్‌లో సంభవించిన సూర్యగ్రహణానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పారు. తన సిద్ధాంతాన్ని వివరించడానికి ఆయన ఈ ప్రత్యేకమైన పదాలను ఉపయోగించారు. “సూర్యగ్రహణం తరువాత విడుదలయ్యే విచ్ఛిత్తి శక్తి కారణంగా.. మొదటి న్యూట్రాన్ పరివర్తన చెందిన కణంతో సంబంధంలోకి వచ్చిన తరువాత కరోనావైరస్ విచ్ఛిన్నమైంది’ అని పేర్కొన్నారు.
ఈ సమస్యపై శాస్త్రీయ అధ్యయనాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నారు. ఎందుకంటే రాబోయే సూర్యగ్రహణం వైరస్‌కు సహజ నివారణగా ముగియనుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఒక జ్యోతిష్కుడు.. కరోనావైరస్ జాతకాన్ని వివరంగా పరిశోధించి కొన్ని ఆశ్చర్యకరమైన తీర్మానాలను వెల్లడించాడు. మకరరాశిలో చాలా గ్రహాలతో కరోనావైరస్ ఉందని చెప్పుకొచ్చాడు. ప్రచారంలో ఉన్నట్టుగా సూర్యగ్రహణంతో కరోనా వైరస్ అంతమైపోతుందో రేపటితో తేలిపోనుంది.