Amman Ahmed : కుక్కలు, పిల్లుల కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తూ మిలియనీర్ అయిన యూట్యూబర్
పిల్లులు, కుక్కలు, ఎలుకలు సంగీతం వింటాయా? వినడమే కాదు వింటూ రిలాక్స్ అవుతాయట. యూఎస్‌కి చెందిన ఒక యూట్యూబర్ వాటికోసం మ్యూజిక్ ట్రాక్స్ కంపోజ్ చేస్తూ మిలియనీర్ అయిపోయాడు.

Amman Ahmed
Amman Ahmed : సంగీతానికి రాళ్లని కరిగించే శక్తి ఉందో లేదో తెలియదు కానీ.. ఆందోళన, ఒత్తడి నుండి దూరం చేస్తుందని చెబుతారు. ఈ ఒత్తిడి మనుష్యులకేనా? జంతువుల్లో కూడా ఉంటుందా? అంటే.. యూఎస్‌కి చెందిన అమ్మన్ అహ్మద్ మాత్రం జంతువుల స్ట్రెస్ పోగొట్టడం కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మిలియనీర్ అయ్యాడు. ఆశ్చర్యపోతున్నారా? చదవండి.
2000 Flights Cancelled : అమెరికాలో మంచు తుపాన్ ఎఫెక్ట్ : 2వేల విమాన సర్వీసుల రద్దు
పిల్లలు, కుక్కలు, ఎలుకలకు కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తూ అమ్మన్ అహ్మద్ అనే యూట్యూబర్ సోషల్ మీడియా సంచలనంగా మారారు. యూఎస్‌కి చెందిన అమ్మన్ అహ్మద్ ‘రిలాక్స్ మై డాగ్ ‘( RelaxMyDog) , ‘రిలాక్స్ మై క్యాట్’ ( RelaxMyCat ) అనే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. వీటిలో మిలియన్ల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ఉన్నారు. మొదటల్లో నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల కోసం సంగీతం కంపోజ్ చేయడం ప్రారంభించిన అతను ఒక స్నేహితుడి సలహా మేరకు జంతువుల కోసం సంగీతం డైరెక్ట్ చేయడం ప్రారంభించారట. ఈ ఆలోచన బాగానే వర్కవుట్ అయ్యిందట. అతని మ్యూజిక్ విని జంతువులు రిలాక్స్ అవుతున్నాయట.
ప్రస్తుతం అమ్మన్ అహ్మద్ పిల్లులు, కుక్కలు రిలాక్స్ అవ్వడం కోసం డజన్ల కొద్దీ ప్లే లిస్ట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇలా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు కొన్ని ట్రాక్స్ వాటిపై పనిచేశాయట.. కొన్ని పనిచేయలేదట. కుక్కల యజమానులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కూడా మ్యూజిక్ డైరెక్ట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతోందని అమ్మన్ అహ్మద్ చెప్పారు. ఐదేళ్ల క్రితం అతను యూకేలో ‘మ్యూజిక్ ఫర్ పెట్స్’ అనే కంపెనీని ప్రారంభించారు. జంతువుల ప్లే లిస్ట్స్‌కు పాపులారిటీ పెరగడంతో యూఎస్‌కి చెందిన మ్యూజిక్ కంపెనీ హక్కులను కొనుగోలు చేసిందట. కంపెనీకి ఇప్పుడు సూపర్ ఫ్యాన్స్ ఉన్నారట. వారు తమ పెంపుడు జంతువులను శాంతపరచడానికి సంగీతంపై ఆధారపడుతున్నారని అమ్మన్ అహ్మద్ చెబుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇలా పెంపుడు జంతువులకు సంగీతం అందిస్తూ మిలియనీర్ అయిపోయారు ఈ యూట్యూబర్. అదన్నమాట సంగతి. అతని క్రియేటివిటీ అతనిని మిలియనీర్‌ను చేసింది.
Instagram पर यह पोस्ट देखें