ఒక్కరోజే 15వేల 968 కరోనా కేసులు, భారత్‌లో ఇదే ఫస్ట్ టైమ్

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు

ఒక్కరోజే 15వేల 968 కరోనా కేసులు, భారత్‌లో ఇదే ఫస్ట్ టైమ్

Updated On : June 22, 2021 / 12:33 PM IST

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు 15 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,968 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 465 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల 56వేల 183కు చేరగా, మరణాలు 14వేల 476కి పెరిగాయి. మన దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారిలో 2లక్షల 58వేల 685మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,83,022.

కరోనా కేసుల్లో టాప్ లో మహారాష్ట్ర:
దేశంలో అత్యధిక కరోనా కేసుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కంటిన్యూ అవుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షా 39వేల 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 3214 కేసులు నమోదవగా, 248మంది మరణించారు. రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో కొత్తగా 3,947 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 68మంది మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 66వేల 602కు చేరగా, మృతులు 2,301కి పెరిగారు. ఢిల్లీ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 24,988. తమిళనాడులో మొత్తం 64,603 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 833 మంది మృతిచెందారు. గుజరాత్‌లో ఇప్పటివరకు 28,371 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1710 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 18,893కి చేరగా, మరణాల సంఖ్య 588కి పెరిగింది.

24 గంటల్లో 2,15,195 కరోనా పరీక్షలు:
దేశవ్యాప్తంగా నిన్నటివరకు(జూన్ 23,2020) 73లక్షల 52వేల 911 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. గత 24 గంటల్లో 2లక్షల 15వేల 195 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపింది.

కరోనాతో ఎమ్మెల్యే మృతి:
వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కరోనాతో మృతిచెందారు. మే నెలలో కరోనా బారిన పడిన ఎమ్మెల్యే తమోనష్‌ ఘోష్‌ (60) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గం నుంచి ఆయన 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Read: కోవిడ్ ఫ్రీ టెస్ట్ ల ఈ మెయిల్ వచ్చిందా జాగ్రత్త…! తెరిచారా…గోవిందా…….